వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం అరెస్ట్ వారెంట్: పనివాళ్లం కాదు.. హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌పై సుప్రీం కోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట హాజరు కాకపోవడంతో ఈ వారెంట్‌ను జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌పై సుప్రీం కోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట హాజరు కాకపోవడంతో ఈ వారెంట్‌ను జారీ చేసింది.

కర్ణన్‌ను అరెస్టు చేసి మార్చి 31లోగా సుప్రీం కోర్టు ముందు హాజరుపరచాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది. రూ. 10వేల పూచీకత్తుపై కర్ణన్‌ బెయిల్‌ తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో 7గురు న్యాయమూర్తుల ధర్మాసనం జస్టిస్‌ కర్ణన్‌ కేసును విచారించనుంది.

Order against me issued to ruin my life: Karnan on bailable warrant

కొందరు జడ్జిలు, విశ్రాంత న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని మోడీ, ఇతరులకు లేఖలు రాసిన ఘటనలో గతంలో కర్ణన్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. అంతేగాక, తన భర్తపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ జస్టిస్‌ కర్ణన్‌ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ మద్రాసు హైకోర్టు జడ్జి భార్య పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్‌ని కూడా సుప్రీంకోర్టు విచారించనుంది. కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్‌ కర్ణన్‌ ఫిబ్రవరిలో కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఆయన హాజరుకాకపోవడంతో ఇప్పుడు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

దీనిపై కర్ణన్ శుక్రవారం కర్ణన్ స్పందించారు. ఇది నేషనల్ ఇష్యూ అని, కొందరు జడ్జిలు అవినీతికి పాల్పడ్డారని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. తనపై ఆర్డర్ ఏకపక్ష నిర్ణయమన్నారు. నా జీవితం, కెరీర్ చెడగొట్టేందుకే ఈ ఆర్డర్ అన్నారు.

లేఖ రాసినందుకు సుమోటోగా ఎస్సీ నోటీసులు జారీ చేసిందని, కనీసం విచారణ జరపలేదన్నారు. సుప్రీం కోర్టే సుప్రీం కాదన్నారు. తాను దళితుడుని కాబట్టే టార్గెట్ చేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు పనివాళ్లు కాదన్నారు.

ఎనిమిదేళ్ల క్రితం తాను అవినీతి జడ్జిల పైన ఫిర్యాదు చేశానని, హైకోర్టులో ఈ కేసు ఇంకా పెండింగులో ఉందన్నారు. ప్రస్తుత, మాజీ జడ్జిలు కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారుపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశానన్నారు.

English summary
The Supreme Court has issued a bailable warrant against Justice C Karnan in a contempt case. The case was taken up Suo Motu by the Supreme Court. Justice Karnan had defied the SC order and failed to appear before the bench.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X