వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బార్డర్ క్రాస్, పాక్ ఆధీనంలో మన జవాన్, మన సైనికుల్నీ చంపేశారా?

|
Google Oneindia TeluguNews

కరాచీ: యూరీ దాడికి భారత్ సర్జికల్ స్ట్రయిక్ ద్వారా పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాల్లో పాక్‌ను ఒంటరి చేసింది. ఐరాసలో పాక్ తీరును ఎండగట్టింది. సార్క్ దేశాల మద్దతును మోడీ ప్రభుత్వం కూడగట్టింది. ఆ తర్వాత బుధవారం రాత్రి సర్జికల్ స్ట్రయిక్ ద్వారా షాకిచ్చింది.

అయితే, పాకిస్తాన్ మీడియాలో షాకింగ్ వార్తలు వస్తున్నాయి. పాక్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. కనీసం ఎనిమిది నుంచి 14 మంది వరకు భారత సైనికులను పాకిస్తాన్ ఫోర్సెస్ హతమార్చాయి. సర్జికల్ స్ట్రయిక్‌కు ప్రతీకారంగా ఇది చేశాయని భావిస్తున్నారు. ఓ సెక్టార్‌లో ఎనిమిది, మరో సెక్టారులో ఆగురురు సైనికులను హతమార్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ వార్తలను భారత సైన్యం ఖండించింది.

Pakistan

పాక్ ఆధీనంలో జవాను

ఓ జవాను పాక్ సైన్యం ఆధీనంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను పొరపాటుగా బార్డర్ దాటినట్లుగా తెలుస్తోంది. పాక్ ఆదీనంలో ఉన్న జవాను.. మహారాష్ట్రకు చెందిన చందు బాబులాల్ చౌహాన్‌గా చెబుతున్నారు. అతనిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నారు. మరో విషయమేమంటే 37 మంది రాష్ట్రీయ రైఫిల్స్ సోల్జర్స్‌ను పాకిస్తాన్ తమ ఆదీనంలోకి తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

భారత హైకమిషనర్‌కు పాక్‌ సమన్లు

పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్‌ గౌతమ్‌ బంబావలేకు పాకిస్థాన్‌ సమన్లు జారీ చేసింది. పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడులు చేసిన నేపథ్యంలో పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం ఆయనకు సమన్లు పంపింది.

జమ్ము కాశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై ఇటీవల భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత విదేశాంగ శాఖ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. యూరీ ఘటనలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్‌ నుంచి వచ్చారనే ఆధారాలను బాసిత్‌కు అందజేశారు.

English summary
Pak captures one Indian soldier, claims to kill 8; Indian army denied killings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X