వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్: పాక్ సైన్యం దాడుల్లో 67మంది ఉగ్రవాదుల హతం

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతం-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పాక్ భద్రత దళాలు ఉగ్రవాదులపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 67మంది ఉగ్రవాదులు మృతి చెందిన పాకిస్థాన్ అధికారులు తెలిపారు.

ఖైబర్‌లోని తిరాహ్ లోయ ప్రాంతంలో పాక్ భద్రతా దళాల ఆకస్మిక దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు మరణించారు. జెట్ విమానాలతో ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నారు.

Pakistan: 67 Militants Killed After School Massacre

పెషావర్‌లోని సైనిక పాఠశాలలో కాల్పులు జరిపిన తాలిబన్లు 132 మంది విద్యార్థులతోపాటు 16మంది పాఠశాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం తాలిబన్ల స్థావరాలపై దాడులకు దిగారు. తమ దాడులను కొనసాగిస్తామని పాకిస్థాన్ తెలిపింది.

ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని బుధవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. కాగా, అంతకుముందు తమ కుటుంబాలపై పాకిస్థాన్ సైన్యం దాడులకు ప్రతీకారంగానే పెషావర్ పాఠశాలపై తాము కాల్పులకు పాల్పడ్డామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Pakistani jets and ground forces killed 67 militants in a northwestern tribal region near the Afghan border, officials said Friday, days after Taliban fighters killed 148 people — most of them children — in a school massacre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X