వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నేను అలా అనలేదు,భారత్ ను పొగడలేదు, పాక్ ఆర్మీ చీఫ్ ఇలా...'

భారత్ విధానాన్ని అనుసరించాలని ఆ విధానం తనకు నచ్చిందని తమ ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వా చెప్పినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పాకిస్తాన్ ఆర్మీ కొట్టిపారేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్తామాబాద్:భారత్ విధానాన్ని అనుసరించాలని ఆ విధానం తనకు నచ్చిందని తమ ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వా చెప్పినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పాకిస్తాన్ ఆర్మీ కొట్టిపారేసింది.

పాకిస్తాన్, భారత్ మీడియాల్లో వచ్చిన వార్తలను పాకిస్తాన్ ఆర్మీ కొట్టిపారేసింది. పాక్ మేజర్ తరపు అధికార ప్రతనిధఇ అసిఫ్ గపూర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఈ వార్తలన్నీ అబద్దాలని, కట్టు కథలని ఆయన మండిపడ్డారు. పాక్ ఆర్మీ చీప్ ఖమర్ బజ్వా డిసెంబర్ లో తన సైనికాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో పరిపాలనలో సైన్యం అసలు జోక్యం చేసుకోకూడదని ఆర్మీకి పరిపాలనకు సంబంధం లేదని చెప్పినట్టు గత వారం పాక్ కు చెందిన జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

Pakistan army denies its chief said 'be more like India'

ఆర్మీ కలగజేసుకోకుండానే ప్రజాస్వామ్య పద్దతిలో పాలననకు భారత్ సమర్థంగా విజయవతంగా చేస్తోందని ఆ దేశాన్ని అనుసరించాలని , మన దేశంలో కూడ అలానే ఉండాలని భజ్వా చెప్పినట్టుగా ఆ మీడియా పేర్కొంది. దాదాపుగా మూడు సార్లు సైనిక పాలన అమలు చేసిన పాక్ కు ఈ వార్తలు ఒక్కసారిగా షాక్ ను ఇచ్చాయి.

భారత్ ను ఈ వార్తలు కొంత ఆలోచనలో పడేశాయి. అయితే భజ్వాకు అలాంటి అభిప్రాయం ఏమీలేదని గఫూర్ స్పష్టం చేశారు. భారత్ ను పొగిడినట్టుగా కథనం రాసిన ఆ మీడియాపై తీవ్రమైన చర్యలకు పాక్ ఉపక్రమిస్తున్నట్టు సమాచారం.

English summary
Pakistan's army has denied that its chief Qamar Bajwa said that his country should be more like India, as was reported in the Indian and Pakistani press.This was indicated in a cryptic tweet yesterday from Pakistan's Major general Asif Ghafoor, the spokesman of the country's armed forces
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X