వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్! యుద్ధానికి సిద్ధమవుతోందా?: సరిహద్దులో సైన్యం యుద్ధ సాధన

|
Google Oneindia TeluguNews

జైసల్మేర్: పాకిస్థాన్ వ్యవహారశైలి చూస్తుంటే భారత్‌తో యుద్ధాన్ని కోరుకుంటున్నట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే.. యూరీ ఉగ్రదాడుల తర్వాతత తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం, వాయుసేన దళాలు అతిపెద్ద సంయుక్త యుద్ధ విన్యాసాలను జైసల్మేర్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ప్రదర్శించింది.

ఈ పాకిస్థాన్ కవ్వింపు చర్య కయ్యానికి కాలుదువ్వుతున్నట్లుగానే కనిపిస్తోంది. కాగా, సెప్టెంబర్ 22 నుంచి వీరి విన్యాసాలు ప్రారంభమైనా, ఇప్పుడు భారీగా మోహరించిన సైన్యం మరిన్ని విన్యాసాలు చేస్తోందని సమాచారం. జైసల్మేర్ సమీపంలోనే మొత్తం 15 వేల మంది పాక్ జవాన్లు, 300 మందికి పైగా ఎయిర్ ఫోర్స్ బలగాలు విన్యాసాల్లో పాల్గొంటున్నారని తెలిసింది.

Pakistan army 'exercising' near border adjoining Jaisalmer

పాకిస్థాన్ సైన్యం ఈ యుద్ధ సాధనను అక్టోబర్ 30 వరకు కొనసాగించనున్నట్లు తెలిసింది. చాలా మంది పాక్ సైనికాధికారులు ఈ ఆర్మీ ఎక్సర్ సైజ్‌ను తిలకించేందుకు వచ్చారని సమాచారం.

కరాచీకి చెందిన ఐదు దళాలు, ముల్తాన్‌కు చెందిన 2 దళాలతో పాటు 205 బ్రిగేడ్ ఈ వార్ గేమ్స్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఎడారిని సైతం వదలకుండా యుద్ధపు ఆటలు ఆడుతోంది. పాక్ చర్యలతో అప్రమత్తమైన భారత సరిహద్దు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కట్టుదిట్టంగా పని చేస్తున్నాయి. మరింత బలగాలను మోహరించేందుకు బిఎస్ఎఫ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

English summary
After the fatal Uri attack+ , Pakistan Army and Air Force have started its biggest core level joint war game exercise some 15-20km away from the international border adjoining Jaisalmer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X