వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ హై కమిషన్ అధికారి అరెస్టు: కీలక పత్రాలు చోరీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ రాయభారి కార్యాలయానికి చెదిన అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. భారత రక్షణ శాఖకు చెందిన కీలక ప్రతాలు దాచి పెట్టుకున్నాడని సమాచారం రావడంతో ఆయన్ని అధికారులు అరెస్టు చేశారు.

మొహమ్మద్ అక్తర్ దగ్గర భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలు చిక్కాయి. భారత్ లోని పాక్ హైకమిషన్ లో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ అక్తర్ అనే అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మొహమ్మద్ అక్తర్ ను చాణక్యపురి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి రహస్యంగా విచారిస్తున్నారు.

మొహమ్మద్ అక్తర్ దగ్గర భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలు చిక్కడంతో మొహమ్మద్ అక్తర్ ను అరెస్టు చేసిన తరువాత పాక్ హై కమిషనర్ అబ్దుల్ బసిత్ కు భారత్ అధికారులు సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Pakistan official questioned for alleged leak of Defence Documents

మొహమ్మద్ అక్తర్ భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను చోరీ చేశాడని అధికారులు గుర్తించారు. భారత ఇంటిలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మొహమ్మద్ అక్తర్ ను అరెస్టు చేశారు.

పాక్ కు చెందిన కొందరు అధికారులు గూఢచర్యం చేస్తున్నారని ఇంటిలిజెన్స్ బ్యూరో చాల సంవత్సరాల నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నది. 2015 నవంబర్ లో పాక్ ఇంటిలిజెన్స్ కు సహకరిస్తున్నారని పాక్ హైకమిషన్ కు చెందిన ఐదు మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి పాక్ అధికారుల మీద గట్టి నిఘా వేశారు.

మాకు చెప్పలేదే ? పాక్

పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని పాక్ హై కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియాలో ఉస్తున్న కథనాలు గురించి మాకు తెలుసు, అంతే కాని భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని, మీడియాలో వస్తున్న వార్తలపై తాము స్పంధించమని పాక్ హైకమిషన్ తెలిపింది.

English summary
Mohammed Akhtar, was questioned by the Delhi Police but let off because of diplomatic immunity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X