వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే విలీనం: మీడియాకు హింట్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అమ్మ సమాధి సాక్షిగా!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాల విలీనం విషయంలో అతి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. శనివారం పన్నీర్ సెల్వం చెన్నైలోని ఆయన ఇంటిలో మీడియాతో మాట్లాడుతూ విలీనం చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

పన్నీర్, పళనిసామి చర్చలు విఫలం: ఈ డిమాండ్లకు క్లారిటీ లేదు, పన్నీర్ పట్టుతో సీఎంకు?పన్నీర్, పళనిసామి చర్చలు విఫలం: ఈ డిమాండ్లకు క్లారిటీ లేదు, పన్నీర్ పట్టుతో సీఎంకు?

శుక్రవారం రాత్రి విలీనం విషయంపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయని, సానూకూల వాతావరణం ఉందని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తమ డిమాండ్ల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి సానుకూలంగానే స్పందించారని పన్నీర్ సెల్వం వివరించారు.

Paneerselvam assures AIADMK merger will be within two days

శనివారం రాత్రి మరో సారి విలీనం చర్చలు ఉంటాయని పన్నీర్ సెల్వం హింట్ ఇచ్చారు. తమిళనాడులో మరో నాలుగు సంవత్సరాలు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని పన్నీర్ సెల్వం వివరించారు.

పన్నీర్ సెల్వందే తుది నిర్ణయం: నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా నాయకుడు!పన్నీర్ సెల్వందే తుది నిర్ణయం: నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా నాయకుడు!

మొత్తం మీద సానుకూలంగా విలీనం చర్చలు జరుగుతున్నాయని అన్నాడీఎంకే (పురచ్చి తలైవి అమ్మ) వర్గం నాయకుడు పన్నీర్ సెల్వం మొదటి సారి బహిరంగంగా మీడియాకు చెప్పడంతో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు య్యిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సోమవారం మంచి ముహుర్తం చూసుకుని అమ్మ జయలలిత సమాధి సాక్షిగా ముక్కలైన అన్నాడీఎంకే పార్టీని ఒక్కటి చెయ్యాలని రెండు వర్గాలు నిర్ణయించాయి.

English summary
ADMK rivalry faction leader O. Paneerselvam says that ADMK merger talks were going on, soon the merger will be announced to the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X