వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్యాయం జరిగింది: పన్నీరు సెల్వం కోసం ప్రాణత్యాగం

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్వంకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత బుధవారం మూసా (37)అనే అభిమాని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్వంకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత బుధవారం మూసా (37)అనే అభిమాని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తీవ్ర గాయాలపాలైన అతడిని కిల్పాక్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మూసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

<strong>షాక్: జైలు నుంచి ఫోన్లో మాట్లాడిన శశికళ, సీఎం-మంత్రులకు ఆదేశాలు</strong>షాక్: జైలు నుంచి ఫోన్లో మాట్లాడిన శశికళ, సీఎం-మంత్రులకు ఆదేశాలు

Panneerselvam supporter attempts self immolation

ఇటీవల తమిళ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనని తీవ్రంగా కలచి వేశాయని, పన్నీర్‌కు అన్యాయం జరిగిందని మూస ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పన్నీరు సెల్వం, మాజీ మంత్రులు పాండ్యరాజన్, పొన్నయన్‌, కేపీ మునుస్వామిలు బాధితుడిని పరామర్శించి ఖర్చుల నిమిత్తం రూ.1లక్షను కుటుంబ సభ్యులకు అందించారు.

పెరియ కాంచీపురం ప్రాంతానికి చెందిన మూసా పెయింటర్‌గా పని చేసేవాడు. మూసాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శశికళకు వ్యతిరేకంగా, పన్నీరుకు మద్దతుగా నినాదాలు చేస్తూ వానిగర్‌ వీధిలోకి వచ్చిన మూసా.. తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

English summary
Former chief minister Panneerselvam supporter attempts self immolation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X