వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా లేడీపై రేప్: దోషిగా తేలిన సినీ డైరెక్టర్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శక రచయిత మహమూద్ ఫారూఖీ దోషిగా తేలాడు. ఏడాది పాటు జరిగిన విచారణ తర్వాత శనివారంాడు ఢిల్లీ స్థానిక కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. అత్యాచారం చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఫారూఖీని కోర్టు దోషిగా నిర్ధారించింది.

ఆగస్టు 2వ తేదీన శిక్షను ఖరారు చేస్తుంది. బాలీవుడ్ సినిమాలకు ఒరవడి పెట్టిన పీప్లీ లైవ్ చిత్రానికి ఆయన సహ దర్శకుడిగా పనిచేశారు ఫారూఖీ ఆ సినిమాను రూపొందించిన అనూషా రిజ్వీ భర్త కూడా. న్యూయార్క్‌లోని కొలంంబియా విశ్వవిద్యాలయం విద్యార్తిని అయిన 36 ఏళ్ల మహిళ తన పరిశోధన కోసం 2015లో భారత్ వచ్చారు.

Mahmood Farooqi

కొన్ి రెఫరెన్స్‌ల కోసం చారిత్రక పరిశోధక రచయిత అయిన మహమూద్ ఫారూఖీని కలిశారు. దాంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. 2015 మార్చి 28వ తేదీన ఫారూఖీ ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన విందుకు హామీ హాజరైంది. అదే రోజు రాత్రి ఓ గదికి తీసుకుని వెళ్లి అమెరికా మహిళపై అతను అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయింది. కొంత కాలం ఫారూఖీతో ఉత్తరప్రత్యుత్తరాలు కూడా జరిపింది. ఈ క్రమంలోనే తనను క్షమించాలని ఆయన ఆమెను వేడుకున్నాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఆమె రాయబార కార్యాలయంలో సహాయంతో ఫారూఖీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు

దాంతో 2015 జూన్ 21వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది పాటు విచారణ సాగింది. అతను అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పరిశోధక రచయిత అయిన ఫారూకీ విలియం డార్లింపుల్ రాసిన ప్రఖ్యాత రచన వైట్ మొఘల్స్ నవలకు కూడా సహకారం అందించారు.

అమెరికా మహిళ మేధోపరంగా సరిగా లేదని ఫారూఖీ వాదించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయితే, ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతనికి కనిష్టంగా ఏడేళ్లు, గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఆగస్టు 2వ తేదీన కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేస్తుంది.

English summary
Peepli Live co-director Mahmood Farooqui was convicted by a special fast-track court on Saturday for raping a 35-year-old American woman in 2015. The court will decide on the quantum of sentence on August 2 after hearing arguments from both sides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X