వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూలు మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూలుపై ఉగ్రవాదుల దాడి ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోడీ మాట్లాడారు.

పాకిస్ధాన్‌కు సంఘీభావంగా భారత్‌లో పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రధాని మోడీ భారతీయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు.

విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడిలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇప్పటికీ పలువురు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పెషావర్‌లో సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేసి ముక్కు పచ్చలారని అమాయకమైన పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో 138 మంది దాకా మరణించారు. మృతుల్లో 125 మంది విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని దేశాల అధినేతలు సంఘటనను ఖండించారు.

ఆరుగురు ఉగ్రవాదులను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది. పెషావర్‌లోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయింది. ఆస్పత్రులు రక్తదానం కోసం వేడుకుంటున్నాయి. మహిళా టీచర్‌ను ఉగ్రవాదులు సజీవ దహనం చేశారు. పాక్ చరిత్రలో అత్యంత కిరాతకమైన చర్యగా ఇది నిలిచిపోతుంది.

 ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూలు మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. పాకిస్ధాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూలుపై ఉగ్రవాదుల దాడి ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోడీ మాట్లాడారు.

 ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

పాకిస్ధాన్‌కు సంఘీభావంగా భారత్‌లో పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రధాని మోడీ భారతీయ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

 ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

మోడీ పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పెషావర్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు.

 ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

ప్రధాని షరీఫ్‌తో మాట్లాడిన మోడీ... 2 నిమిషాల పాటు మౌనం

విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడిలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

English summary
A day after the banned terrorist outfit Tehrik-i-Taliban Pakistan (TTP) attacked the Army Public School in Peshawar and killed at least 141 people in cold blood, including 132 students, several schools in India paid their tribute to the victims on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X