వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గే సెక్స్ ను అడ్డుకోవద్దు..' : సుప్రీంకి మొరపెట్టుకున్న సెలబ్రిటీ 'గే' లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా హోమో సెక్సువల్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలోను 'గే' హక్కులను కాపాడుకునే దిశగా పోరాటం మొదలుపెట్టారు కొంతమంది సెలబ్రిటీ 'గే' లు. వివిధ రంగాల్లో ప్రముఖులుగా కొనసాగుతోన్న కొంతమంది సెలబ్రిటీ 'గే' లు తమ హక్కులను కాపాడాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

హోమో సెక్సువల్స్ లైంగిక చర్యలకు అడ్డంకిగా ఉన్న ఐపీసీ సెక్షన్-377 ని రద్దు చేయాలని కోరుతూ 'గే' సెలబ్రిటీలంతా సుప్రీం కోర్టుకు నివేదించారు. సెక్స్ కి సంబంధించనంత వరకు ప్రతి వ్యక్తికి స్వేచ్చ ఉంటుందని, జీవించే హక్కులో భాగమైన సెక్స్ హక్కులను ఐపీసీ సెక్షన్-377 ద్వారా తమకు మాత్రం దూరం చేస్తున్నారని సెలబ్రిటీ 'గే' లు వాపోతున్నారు.

Petition Against Ban On Gay Sex To Be Heard By Chief Justice Of India

ఇదిలా ఉంటే.. వేసవి సెలవులు ముగియడంతో బుధవారం నుంచి సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో బుధవారం నాడు సెలబ్రిటీ 'గే' లు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం, పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీనికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్లపై తీర్పు పెండింగ్ లో ఉందని పేర్కొన్న ధర్మాసనం క్యూరేటివ్ పిటిషన్లపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తీర్పు ఇవ్వాల్సి ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.

కాగా, పిటిషన్ దాఖలు చేసిన సెలబ్రిటీ 'గే' జాబితాలో చెఫ్ రితు దాల్మియా, హోటలియర్ అమన్ నాథ్, డ్యాన్సర్ ఎన్ ఎస్ జోహర్ ఉండడం గమనార్హం.

English summary
The Supreme Court took up the plea by some high-profile celebrities seeking quashing of section 377 of the Indian Penal Code which criminalises homosexuality in the country.The celebrities, including chef Ritu Dalmia, hotelier Aman Nath and dancer NS Johar, have sought protection of their sexual rights on the ground that it is an integral part of the fundamental right to life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X