వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి రక్తంతో లేఖ : ' మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్'

|
Google Oneindia TeluguNews

రాంచీ : తమ జీతభత్యాలను పెంచాలని డిమాండ్ చేస్తూ.. జార్ఖండ్‌కి చెందిన కొంతమంది పారాటీచర్లు ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, వేతన పెంపు కోరుతూ గత నెల రోజులుగా పారా టీచర్లు సమ్మె బాట పట్టారు.

ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నా.. వేతనాల్లో పెరుగుదల మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చేస్తోన్న పారా టీచర్లను శనివారం నాడు పోలీసులు అరెస్టు చేయడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమ సమస్యను విన్నవిస్తూ.. తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రధాని మోడీకి రక్తం లేఖతో రాశారు కొంతమంది మహిళా పారాటీచర్లు.

'Please Help Us': Jharkhand Para Teachers Write To PM Modi In Blood

ప్రస్తుతం జార్ఖండ్‌ వ్యాప్తంగా.. మొత్తం 80వేల మంది పారాటీచర్లు విధులు నిర్వహిస్తుండగా, వీరి నెల జీవితం కేవలం రూ.6వేలు మాత్రమే. దీంతో వేతనాన్ని పెంచి తమకు అండగా నిలబడాలని కోరుతున్నారు జార్ఖండ్ పారాటీచర్లు. మరి.. ఈ రక్తం లేఖపై ప్రధాని మోడీ స్పందన ఎలా ఉండబోతుందో!

English summary
Thousands of para teachers in Jharkhand, on strike for more than a month demanding a wage hike, have written a letter in blood to Prime Minister Narendra Modi seeking his intervention in the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X