వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పటేల్ లేకుంటే గాంధీ సగమే: ఏక్తారన్‌లో మోడీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశాన్ని ఏకీకృతం చేయడానికి సర్ధార్ వల్లభాయ్ అంకితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పటేల్ జీవితం ఎంతో స్ఫూర్తి దాయకమైనదని, ఆయన స్ఫూర్తితో కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని మోడీ ఆకాంక్షించారు. ఉక్కు మనిషిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ పటేల్ లేకుంంటే మహాత్మా గాంధీ అసంపూర్ణమని ఆయన వ్యాఖ్యానించారు.

అంతకుముందు మోడీ.. పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ పరుగులో ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ఎంపీలు, ప్రముఖులు, క్రీడాకారులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్‌దే కొనియాడారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైనది దండియాత్ర అని చెప్పారు. భారతదేశ స్వతంత్ర కాంక్ష, శక్తిని చాటిన దండియాత్రలో మహాత్ముడితో కదం కదం కలిపి నడిచిన వ్యక్తి పటేల్ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వస్తే దేశం ముక్కలైపోతుందని బ్రిటీష్ వారు భావించారని.. కానీ దేశమంతటినీ ఒక్కతాటిపై నిలిపిన మహనీయుడు పటేల్ అని మోడీ కీర్తించారు. సంస్థానాల విలీనమే పటేల్ శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని మోడీ కొనియాడారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

దేశాన్ని ఏకీకృతం చేయడానికి సర్ధార్ వల్లభాయ్ అంకితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

పటేల్ జీవితం ఎంతో స్ఫూర్తి దాయకమైనదని, ఆయన స్ఫూర్తితో కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని మోడీ ఆకాంక్షించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఉక్కు మనిషిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఈ పరుగులో ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ఎంపీలు, ప్రముఖులు, క్రీడాకారులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

మాజీ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ఐక్యతా పరుగు' ప్రారంభించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఈ ఐక్యతా పరుగు కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఐక్యతా పరుగును ప్రారంభించిన రాష్ట్రపతి

మాజీ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ఐక్యతా పరుగు' ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా తమ ప్రభుత్వ హయాంలో కూడా పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని విస్మరించడానికే బిజెపి ప్రభుత్వం పటేల్ జయంతిని ముందుకు తీసుకొస్తుందని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi flagged off a "Run for Unity" and then briskly walked down Rajpath in the heart of Delhi on Friday morning with thousands of participants in a tribute to independent India's first home minister and his hero Sardar Vallabhbhai Patel on his 139th birth anniversary, being celebrated as Rashtriya Ekta Diwas or National Unity Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X