వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిసాన్ ఛానెల్‌ను ప్రారంభించిన మోడీ: 'వ్యవసాయాన్ని తప్పక ప్రోత్సహించాలి'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈరోజు దూరదర్శన్ కిసాన్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని అన్నారు. భారత్‌లో వ్వవసాయాన్ని తప్పక ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

వ్యవసాయంతో గ్రామాలు, గ్రామాలతో దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉత్పత్తి పెరుగుదల ఆదాయం పెంచడానికి దోహదపడుతుందని అన్నారు. 200 ఏళ్ల క్రితం యూరియా, పొటాషియం లేవని, సేంద్రియ ఎరువుల ద్వారా రైతులు హెక్టారుకు 15 నుంచి 18 టన్నుల ధాన్యం దిగుబడి సాధించేవారని అన్నారు.

PM Modi launches DD Kisan channel, says agriculture must be encouraged

కిసాన్ టీవీ ఛానెల్ రైతుల కోసం 24 గంటలూ పనిచేస్తుందని మోడీ అన్నారు. వ్యవసాయం రంగంలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఆధునిక సాంకేతిక చాలా అవసరమని చెప్పారు. ఉన్నత విద్య చదువుకున్న యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌తో పాటు పలు అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు తదితరులు హాజరయ్యారు. కిసాన్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఛానల్‌ ఏర్పాట్లను దూరదర్శన్‌ పర్యవేక్షిస్తుంది.

PM Modi launches DD Kisan channel, says agriculture must be encouraged

ప్రసారభారతి ఆధ్వర్యంలో దూరదర్శన్‌ నిర్వహించనున్న ఈ ఛానెల్‌ ద్వారా వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. దీనికి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ సమాచారం అందిస్తుంది. రైతులకు వ్యవసాయం, పాడి, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ ఛానెల్‌‌లో ప్రసారం చేస్తారు.

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ

ఎన్టీయే ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలిశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

అంతక ముందు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మోడీ మాట్లాడారు.

English summary
While stating that the growth of the villages are key to the growth of the nation, Modi said, “Increase in production will lead to increase income.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X