వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మన్‌కీ బాత్’లో మోడీ-ఒబామా: కూతుళ్లతో వస్తామన్న మిచెల్లీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ ఇద్దరు కూతుళ్లు ప్రస్తుత పర్యటనలో భారత్‌కు రాలేకపోయారని.. మరోసారి తప్పకుండా వారితో కలిసి తాజ్‌మహల్ సందర్శనకు వస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఒబామా పర్యటన ముగింపు రోజైన మంగళవారం రాత్రి 8గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు సరాదాగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా వారు ప్రస్తావించారు. పలు ప్రశ్నలకు సమాధాలిచ్చారు. ‘బరాక్ అనే పదానికి అర్థం తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెదికాను. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే స్వాహిలి భాషలో.. బరాక్ అంటే ‘వరపుత్రుడు' అని అర్థం' అని మోడీ తెలిపారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

ఒబామా పర్యటన ముగింపు రోజైన మంగళవారం రాత్రి 8గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మన్ కీ బాత్

మన్ కీ బాత్

మోడీ మాస్కులు ధరించి మన్ కీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దృశ్యం.

మన్ కీ బాత్

మన్ కీ బాత్

మోడీ, ఒబామా పాల్గొన్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రేడియోలో వింటున్న ప్రజలు.

మన్ కీ బాత్

మన్ కీ బాత్

ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు సరాదాగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా వారు ప్రస్తావించారు. పలు ప్రశ్నలకు సమాధాలిచ్చారు.

నోబెల్ గ్రహీత సత్యార్థితో మిచెల్లీ ఒబామా

నోబెల్ గ్రహీత సత్యార్థితో మిచెల్లీ ఒబామా

ప్రస్తుత పర్యటనలో తాజ్‌మహల్ సందర్శించడం కుదరలేదని.. తాజ్‌ను సందర్శించేందుకు తమ కూతుళ్లతో కలిసి భారత్‌కు మళ్లీ వస్తామని అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా తెలిపారు.

ఒబామా-మిచెల్లీ

ఒబామా-మిచెల్లీ

షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వారు తాజ్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే సౌదీ రాజు మరణంతో వారు తమ తాజ్ సందర్శనను రద్దు చేసుకొని, సౌదీ అరేబియాకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

మన్ కీ బాత్

మన్ కీ బాత్

మోడీ-ఒబామా పాల్గొన్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని టీవీ షోరూంలో తిలకిస్తున్న జనం.

‘నమస్తే' అంటూ ఒబామా తన ప్రసంగం ప్రారంభించారు.‘భారత్-అమెరికా దేశాధినేతలు కలిసి చేస్తున్న మొదటి రేడియో ప్రసంగం ఇది. స్వల్ప సమయంలోనే మనం చరిత్ర సృష్టిస్తున్నాం. ఈ ఘనమైన దేశ ప్రజలందరితో నేరుగా మాట్లాడటం అద్భుతంగా ఉంది' అని ఒబామా తెలిపారు.

తాము జీవితంలో ఇంతస్థాయికి వస్తామని ఎప్పుడూ ఊహించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు నేతలు చెప్పారు. తన కుమార్తెలు భారత పర్యటనలో పాల్గొనలేకపోయారని, బహుశా, అధ్యక్షుడిగా తన పదవి కాలం పూర్తయ్యాక వారి కోసం మళ్లీ భారత్‌కు రావాల్సి ఉంటుందని ఒబామా చెప్పారు. కుటుంబం, పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మోడీ తెలిపారు.

తాజ్ కోసం పిల్లలతో కలిసి మళ్లీ వస్తాం: మిచెల్లీ

ప్రస్తుత పర్యటనలో తాజ్‌మహల్ సందర్శించడం కుదరలేదని.. తాజ్‌ను సందర్శించేందుకు తమ కూతుళ్లతో కలిసి భారత్‌కు మళ్లీ వస్తామని అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా తెలిపారు. నిజానికి, ఒబామా దంపతుల పర్యటనలో తాజ్ సందర్శన కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వారు తాజ్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే సౌదీ రాజు మరణంతో వారు తమ తాజ్ సందర్శనను రద్దు చేసుకొని, సౌదీ అరేబియాకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

English summary
Prime Minister Narendra Modi and US President Barack Obama together on Tuesday scripted another history as they addressed the nation together in a special edition of 'Mann ki baat'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X