వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్‌కు థ్యాంక్స్ చెప్పిన మోడీ, ఫేక్ ట్విట్టర్‌ ఐడీపై బిగ్ బి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌ భూకంప బాధితులను ఆదుకునేందుకు రూ. 11 లక్షల విరాళమిచ్చిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి అమితాబ్ బచ్చన్ ఈ విరాళం ఇవ్వగా, తన ట్విట్టర్ ఖాతాలో మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానమంత్రి సహాయ నిధికి అమితాబ్‌ రూ.11 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో అమితాబ్‌ దయ, జాలి గుణాలపై ప్రశంసల వర్షం కురిపించారు. నేపాల్‌ను అతలాకుతలం చేసిన భూకంపం ఇప్పటి వరకు 9 వేలకు పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకుంది.

ఫేక్ ట్విట్టర్ ఐడీపై స్పందన:

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. తన పేరు మీద ఎవరో నకిలీ ట్విట్టర్ ఖాతను తెరిచారని, ఆ ఖాతాపై టిక్ చేసిన గుర్తు లేదని, ఆ విషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలని చెప్పారు. తన పేరిట వచ్చే ఫేక్ ఖాతా ద్వారా పోస్టింగ్‌లు నమ్మవద్దని, దానికి తాను బాధ్యుడిని కాదని చెప్పారు. హెచ్చరిక: @srbachannc.. ఇక్కడ నాపేరు చివర 'సీ' అనే అక్షరం అదనంగా యాడ్ చేసి ఉంది. ఇది ఫేక్ ఖాతా. అది నేను సృష్టించినది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించి దానిని పట్టించుకోకుండా ఉంటే మంచిది' అని అమితాబ్ తెలిపారు.

రైతుల కోసం 26న కిసాన్ ఛానల్ ప్రారంభించనున్న ప్రధాని

PM Modi thanks Big B for donating 11 lakhs to Nepal earthquake victims

రైతుల కోసం ప్రధాని మోడీ ఈనెల 26న ఓ ప్రత్యేక ఛానెల్‌ను ప్రారంభించనున్నారు. కిసాన్‌ పేరుతో ఏర్పాటుచేయనున్న ఈ ఛానల్‌ను ఏర్పాట్లను దూరదర్శన్‌ పర్యవేక్షించనుంది. ప్రసారభారతి ఆధ్వర్యంలో దూరదర్శన్‌ నిర్వహించనున్న ఈ ఛానెల్‌కు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ సమాచారం అందించనుంది. రైతులకు వ్యవసాయం, పాడి, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ ఛానెల్‌‌లో ప్రసారం చేస్తారు.

English summary
Megastar Amitabh Bachchan has showed his generosity by donating a sum of Rs 11 lakhs to the Prime Minster's National Relief Fund for the Nepal earthquake victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X