హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్షయ తృతీయ: ప్రధాని మోడీ శుభాకాంక్షలు, కిటికిటలాడుతున్న షాపులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయాలన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్నా భారతీయులకు అక్షయ తృతీయ ఎంతో ముఖ్యమైన రోజు. బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం దేశ వ్యాప్తంగా నగల దుకాణాలు ముస్తాబయ్యాయి.

అక్షయ తృతీయ రోజున బంగారం కోనుగోలు చేస్తే ఏడాదంతా సిరి సంపదలు పొందవచ్చని మహిళలు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఇందుకోసం గాను దేశ వ్యాప్తంగా అక్షయ తృతీయ రోజున బంగారు దుకాణ యజమానులు వివిధ ఆకృతుల్లో ఉండే ఆభరణాలను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు తక్కువగా ఉండటంతో కొనుగోలు దారులతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 29,000 ఉండగా, ఈ ఏడాది రూ. 27,000గా ఉంది.

PM Modi wishes nation on Akshay Tritiya

అక్షయ తృతీయ సందర్భంగా దేశంలోని బంగారు ఆభరణాల విక్రాయలు గరిష్ఠంగా 25 శాతం వరకు పెరుగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశారు. ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిన బంగారం ధరలు గడిచిన కొద్ది రోజుల నుంచి కాస్త అటు, ఇటుగా అయినప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇక అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "అక్షయ తృతీయ పర్వదినం నాడు మీకందరికీ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, అభివృద్ధి మరియు విజయాన్ని తీసుకురావాలి" అని ట్వీట్ చేశారు. అక్షయ తృతీయను అకా తీజ్ అని కూడా అంటారు. హిందువులు, జైనులకు ఎంతో పవిత్ర పండుగ.

English summary
Prime Minister Narendra Modi on Tuesday greeted the people on the occasion of Akshay Tritiya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X