వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షీనా హత్య: ఒప్పుకొని కుప్పకూలిన ఇంద్రాణి, లండన్ నుంచి కారు అద్దె

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి... ఇంద్రాణి ముఖర్జీయా ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఖార్ పోలీసు స్టేషన్లో ఇంద్రాణిని పోలీసులు ప్రశ్నించారు.

కీలకమైన 25 ప్రశ్నలను ఇంద్రాణికి వేసి పోలీసులు సమాచారం రాబట్టారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇంద్రాణితో పాటు ఆమె మూడో భర్త పీటర్ ముఖర్జియాను, డ్రైవర్‌ను విచారించారు.

షీనా హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన ఇంద్రాణి అలాగే కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. హత్యకు సంబంధించి పూర్తిగా వివరాలు వెల్లడించింది. ఆమె పది రోజుల తర్వాత నోరు విప్పిందని చెప్పవచ్చు. ఇంద్రాణీ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.

షీనా హత్య కేసులో ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియాను పోలీసులు దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ విచారించారు. ఆయనను మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లండన్ నుంచి భార్య కోసం కారును కిరాయికి...

పీటర్ ముఖర్జీయా తాను లండన్‌‍లో ఉన్న సమయంలోతన భార్య ఇంద్రాణీ కోసం కారును అద్దెకు తీసుకున్నాడు. అయితే, భార్య కోసం అతను లండన్‌లో ఉండగా ఎందుకు తీసుకున్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వొర్లీలోని డాక్టర్ ఈ మోసెస్ రోడ్డు, ఎం మోటార్స్ నుంచి కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ ఎం మోటార్స్ గతంలో పీటర్ పని చేసిన స్టార్ కార్యాలయానికి దగ్గరలో ఉంది. ఎం మోటార్స్‌కు చెందిన వారిని పోలీసులు విచారించారు. తాను, పీటర్ ఎనిమిదేళ్లుగా స్నేహితులమని ఎం మోటార్స్‌కు చెందిన వ్యక్తి చెప్పాడని తెలుస్తోంది.

Police fails to understand why Peter hired a car from London

కాగా, గురువారం విచారణలో భాగంగా పీటర్ ముఖర్జీయా పైన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో భాగంగా నాలుగు గంటల పాటు ఇంద్రాణిని ఆయన ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలడిగారు. తొలుత ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాబట్టారు.

పీటర్ చెప్పిన సమాధానాలు, ఇంద్రాణి చెప్పిన సమాధానాలను పోల్చుకున్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పీటర్‌ను పలు అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, ఇతర కంపెనీల్లో వాటాలు, ఇంద్రాణికి ఎంత డబ్బు ఇచ్చారు, కుమారుడు రాహుల్, షీనా, విధి (ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ కన్నా కుమార్తె, విధిని పీటర్ దత్తత తీసుకున్నారు)లకు ఎంతెంత ఇచ్చారు, ఐఎన్ఎక్స్ మీడియా ఆర్థిక లావాదేవీలు, ఆ సంస్థలో కుటుంబ సభ్యుల ప్రమేయం, ఇంద్రాణే స్వయంగా షీనాను హత్య చేయించి ఉంటే, అందుకు కారణాలు ఏమై ఉండొచ్చు,

షీనాతో ఎఫైర్ ఉందని, వివాహం చేయాలని కొడుకు రాహుల్ అడిగినప్పుడు ఎలా స్పందించారు, రాహుల్‌కు మద్దతుగా నిలిచారా, మాజీ భర్త సంజీవ్‌తో ఇంద్రాణి మాట్లాడుతోందని మీకు తెలుసా, షీనా మాయమైన తర్వాత మీకు అనుమానం వచ్చిందా, రాహుల్ పైన అనుమానం రాలేదా, అతను ఏమైనా చెప్పాడా, షీనా, ఇంద్రాణికి చెల్లెలు కాదు, కుమార్తె అని మీకు తెలుసా, మీరు ఇంద్రాణికి మూడో భర్తనని మీకు తెలుసా, ఇంద్రాణికి ముందే పిల్లలున్నారన్న విషయం తెలుసా, షీనా హత్య జరిగిన ఏప్రిల్ 24, 2012న మీరు ఎక్కడున్నారు? తదితర ప్రశ్నలు అడిగారని సమాచారం.

English summary
Blind faith and love can turn your fate against you and Peter Mukerjea is a classic example of that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X