చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెరీనా బీచ్ ఖాళీ చేయిస్తున్న పోలీసులు, విద్యార్థుల ఎదురుదాడి

జల్లికట్టు శాశ్వత చట్టం కోసం మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు పోలీసుల మీద ఎదురుదాడి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టుకు శాశ్వత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు.

జల్లికట్టు ఆర్డినెన్సుపై అనుమానాలు, కదిలే ప్రసక్తే లేదు, లక్ష మంది !

రిపబ్లిక్ డే పరేడ్ ఇక్కడ నిర్వహించనుండటంతో ఆప్రాంతాన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే మా డిమాండ్లు నెరవేరకుండా ఇక్కడి నుంచి కదిలిలేది లేదని ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు.

Police got injured while did a clash with youths in Chennai

పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడానికి వచ్చిన ప్రతిసారి విద్యార్థులు ఆందరూ గట్టిగా జాతీయగీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో పోలీసులు వెనక్కితగ్గారు. అయితే చివరికి పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది.

దెబ్బకు దెబ్బ: తమిళనాడులో పెప్సీ, కోకాకోలా బ్యాన్

విద్యార్థులు పోలీసుల మీద ఎదురుదాడికిదిగారు. ఆ సమయంలో పలు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే మెరీనా బీచ్ ను ఖాళీ చేయిస్తున్నారని డీఎంకే పార్టీ ఆరోపించింది.

English summary
Police did stone pelting on students who were running away from Marina. Police traced the students and used batons charge on students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X