వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా వైస్ చాన్స్ లర్ హత్యకు కుట్ర

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రసిద్ధి చెందిన హంపి కన్నడ విశ్వవిద్యాలయం ఉప కులపతి మల్లికా ఘంటిని హత్య చెయ్యడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న కువెంపు విశ్వవిద్యాలయం సిబ్బంది పై కర్ణాటకలోని భద్రావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత ప్రొఫసెర్ ఎం.ఎం. కలబుర్గిని హత్య చేసినట్లు మల్లికా ఘంటిని హత్య చెయ్యాలని నలుగురు ఉద్యోగులు మాట్లాడుకుంటున్న సమయంలో రహస్యంగా రికార్డు చేయ్యడంతో అసలు విషయం బయటపడింది. మల్లికా ఘంటి ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు అన్నారు.

 police have registered a FIR against 4 staff members of Kuvempu university

కువెంపు విశ్వవిద్యాలయంలోని జంతు విభాగంలో ప్రొఫసెర్ గా పని చేస్తున్న హోసట్టి, పరిక్షా విభాగం సీనియర్ అధికారి విజయ, సిద్దలింగయ్య, సలీం అనే నలుగురి మీద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ నలుగురు మహిళా వైస్ చాన్స్ లర్ మల్లికా ఘంటిని కాల్చి చంపాలని ప్లాన్ వేశారని పోలీసులు అన్నారు.

ప్రస్తుతం హంపి కన్నడ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా పని చేస్తున్న మల్లికా ఘంటి గతంలో కువెంపు విశ్వవిద్యాలయంలో పని చేశారు. ఈమెను హత్య చెయ్యడానికి ఈ నలుగురు ప్లాన్ వేశారని వెలుగు చూసింది.

ప్రొఫసెర్ ఎం.ఎం. కలబుర్గిని ఎలా కాల్చి చంపారో అదే విధంగా మల్లికా ఘంటిని హత్య చెయ్యాలని మాట్లాడుకున్నారు. ఆ సందర్బంలో కువెంపు విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి మొబైల్ లో రికార్డు చేసి మల్లికా ఘంటికి అందివ్వడంతో విషయం వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
Bhadravathi Rural police have registered a FIR against 4 staff members of Kuvempu university on charges of planning a murder of Mallika Ghanti, Vice-Chancellor of Kannada University
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X