ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం

Subscribe to Oneindia Telugu

ముంబై: మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ గది నెంబర్ 320 లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ భద్రత అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.

బాధిత బాలిక ఓ నగల షాపులో పనిచేస్తోంది. ఆ షాపు యజమాని మాయమాటలు చెప్పి ఆ బాలికను ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని గది నెంబర్ 320లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

Police probe security lapses at MLA hostel after minor's rape

ఈ ఘటనలో షాపు యజమాని మనోజ్ భగత్ , రజత్ మదరేలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ క్వార్టర్స్ లో కార్యకర్తలు మిహనా ఎమ్మెల్యేలు నివాసముండరు సాధారణంగా వాటిలో చాలావరకు ఖాళీగానే ఉంటాయి.

దీన్ని ఆసరాగా చేసుకొని మనోజ్ ఆ బాలికను తీసుకొని వెళ్ళిఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ అత్యాచారం ఎలా జరిగిందనే విషయం అంతుచిక్కడం లేదు.
శివసేన నాయకురాలు నీలమ్ గోర్హే ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

English summary
Police are probing alleged security lapses and scanning the CCTV footage of the MLA hostel here where two persons booked a room and allegedly raped a 17- year-old girl on the premises.
Please Wait while comments are loading...