వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవింద్‌కు పోటీగా అంబేద్కర్‌ వారసుడు, సీపీఎం సూచన, రేపు తుది నిర్ణయం

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వారసుడు.. ప్రకాష్ అంబేద్కర్ ను నిలబెడితే‌ గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని సీపీఎం భావిస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దళిత మేధావిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోన్న అధికార పక్షానికి.. అంతే గట్టిగా పోటీ ఇవ్వాలని విపక్షాలు భావిస్తున్నాయి.

ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వారసుడిని బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి. అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ను అభ్యర్థిగా నిలబెడితే‌ గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని సీపీఎం భావిస్తోంది.

prakesh-amdedkar

ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ సహా 18 విపక్ష పార్టీలకు విన్నవించినట్లు, గురువారం ఢిల్లీలో జరగనున్న భేటీలో ప్రకాశ్‌ అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సీపీఎంకు చెందిన కీలక నాయకుడొకరు తెలిపారు.

మహారాష్ట్రలో భరిప్‌ బహుజన్‌ మహాసంఘ్‌(బీబీఎం) పార్టీకి నేతృత్వం వహిస్తోన్న ప్రకాశ్‌ అంబేద్కర్‌ గతంలో అకోలా పార్లమెంట్‌ స్థానం నుంచి రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. ఒకమారు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు.

మరోవైపు కాంగ్రెస్ కూడా తమ పార్టీకి చెందిన అభ్యర్థినే రాష్ట్రపతిగా పోటీకి నిలపాలని భావిస్తోంది. అందులో భాగంగానే మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఇంతలో సీపీఎం నేతలు అంబేద్కర్‌ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. మరి విపక్షాల తుది నిర్ణయం ఎలా ఉంటుందో, రాష్ట్రపతి రేసులో ఎవరిని నిలబెడతారో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

English summary
Prakash Ambedkar, a former MP and grandson of B R Ambedkar, is emerging as the top pick of Left parties for the presidential election against the NDA nominee Ram Nath Kovind. Though the Left parties are aware that the numbers are loaded against them, they are firm on a “political contest” in the election to the highest constitutional office. CPI(M) General Secretary Sitaram Yechury is holding informal consultations with the Congress and non-NDA parties to seek their opinion about his candidature, sources in Left parties said on Wednesday. “We are thinking of Prakash Ambedkar. If the Congress and other opposition parties agree, we will put him up (for the July 17 presidential election),” a source in the Left camp told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X