వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజకీయాల్లో ప్రముఖ రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని, భాజపా వ్యవస్థాపక సభ్యుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.

అనారోగ్యంతో వాజ్‌పేయి కొన్నేళ్లుగా తన నివాసానికే పరిమితమయిన కారణంగా ప్రొటోకాల్‌కు భిన్నంగా ప్రణబ్‌.. కృష్ణమీనన్‌ మార్గ్‌లోని వాజ్‌పేయీ నివాసానికి వెళ్లి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో వాజ్ పేయి ప్రధానిగా, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్ పేయి ఉదార స్వభావాన్ని, ఆర్ధిక సంస్కరణలకు ఊతమివ్వడంతో ఆయన నిబద్ధతను ప్రశంసించారు.

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు


దివంగతం నందరమూరి తారకరామావావుకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. భారత రాజకీయలకు కొత్త నిర్వచనం ఇచ్చినందుకు ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు.

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

ఈ విషయమై కేంద్రంలో మాట్లాడుతానన్నారు. దేశం సంస్కరణలకు పునాది వేసిన మాజీ ప్రధాని పివి. నరసింహారావుకు దేశ రాజధానిలో తగిన స్మారకాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వాజపేయి నివాసంలో కార్యక్రమం అనంతరం చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశంలో, ఏపీ, తెలంగాణల్లో ఉన్నా తాజా రాజకీయ పరిస్ధితిపై చర్చించారు.

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

తీవ్ర ఆర్ధిక లోటు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం నుంచి సాయం అందించడానికి, పెండింగ్‌లో ఉన్న నిధులు అందించడానికి అమిత్ షా జోక్యం చేసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా గట్టిగా ఆయన్ని కోరినట్లు సమాచారం.
 వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు


రాజకీయాల్లో ప్రముఖ రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని, భాజపా వ్యవస్థాపక సభ్యుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

వాజపేయికి ఓకే, ఎన్టీఆర్‌కు భారతరత్న: బాబు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ వుహ్మద్‌ సయీద్‌, జేడీ (యు) నేత శరద్‌ యాదవ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
Former prime minister Atal Bihari Vajpayee was on Friday conferred with the Bharat Ratna, India's highest civilian honour, by President Pranab Mukherjee in a brief ceremony at his home here attended by the country's leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X