వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణతంత్రం: మంచు వర్షం, గొడుగు కింద ఒబామా, పక్కన మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు.

కాసేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా వచ్చారు. ఆయన వాహనం 'ద బీస్ట్' వస్తుంటే దారి పోడవునా ప్రజలు ఆయనకు హర్షాతిరేకంతో స్వాగంత పలికారు. ఒబామా దంపతులకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకల భద్రత దృష్ట్యా 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

వరదరాజన్, నీరజ్‌కుమార్ సింగ్‌కు ‘అశోక చక్ర'

అనంతరం అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్ కుమార్‌ల తరుపున దివంగత సైనికాధికారుల భార్యలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. షోపియాన్‌లో ఉగ్రవాదుల కాల్పులో ముకుంద్ వరదరాజన్, కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నాయక్ నీరజ్ కుమార్ అమరులయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒబామా దంపతులు వీక్షిస్తున్నారు.

అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళి:

రాజ్‌పథ్‌లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పరిచయం చేస్తున్న దృశ్యం.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంచు వర్షం కారణంగా గొడుగుతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ప్రక్కనే ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదికపైకి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదికపైకి వస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నమస్కరిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్ కుమార్‌ల తరుపున దివంగత సైనికాధికారుల భార్యలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్ కుమార్‌ల తరుపున దివంగత సైనికాధికారుల భార్యలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్ కుమార్‌ల తరుపున దివంగత సైనికాధికారుల భార్యలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్ కుమార్‌ల తరుపున దివంగత సైనికాధికారుల భార్యలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడుకలను తిలకిస్తున్న అతిథి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. పక్కనే ప్రధాని నరేంద్రమోడీ.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదికపైకి వెళుతున్న ఒబామా దంపతులు. ఆయన వాహనం 'ద బీస్ట్' వస్తుంటే దారి పోడవునా ప్రజలు ఆయనకు హర్షాతిరేకంతో స్వాగంత పలికారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాజ్ పథ్‌పై భారత అశ్వదళం.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాజ్ పథ్‌పై భారత అశ్వదళం.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

 చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

చిరు జల్లుల మధ్యే గణతంత్ర వేడుకలు

రాజ్ పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

ఢిల్లీలో చిరుజల్లులు... భారీగా ప్రజలు

గణతంత్ర వేడుకలు దగ్గరుండి చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఢిల్లీలో మంచు దాదాపు చిరు జల్లులు మాదిరి కురుస్తుండటంతో ముఖ్య అతిథులతో పాటు దాదాపు వేడుకలకు హాజరైనవాళ్లంతా గొడుగులు పట్టుకుని ఉన్నారు. పెరేడ్ మార్గం కూడా మొత్తం మంచుతో తడిసిపోయింది.

అలరించిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర శకటాలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. సంక్రాంతి ఇతివృత్తంగా ప్రదర్శించిన ఆంధ్రప్రదేస్ శకటం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాలు ఇతవృత్తంగా సాగిన తెలంగాణ శకటం ఆకట్టుకున్నాయి.

గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న త్రవిధ దళాల పరేడ్

66వ గణతంత్ర వేడుకలు రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. సైన్యం, వాయుసేన, నావికాదళ బృందాల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ముఖ్యంగా మహిళ సైనికుల కవాతు అద్భుతం.

English summary
Chief Guest Barack Obama along with his wife Michelle arrive; warmly received by PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X