వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాది పాలనలో అవినీతి లేదు, దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసింది: మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బీజీపీ ‘జన కళ్యాణ్ పర్వ' ప్రచార సభను సోమవారం నిర్వహించింది. ఈ ‘జన కళ్యాణ్ పర్వ'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముందుగా దీన్‌దయాళ్ ధామ్ వద్ద దీన్‌దయాల్ ఉపాధ్యాయకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు.

మధురలో ఏర్పాటు చేసిన 'జన కల్యాణ్‌ పర్వ'లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణుడు నివసించిన పుణ్యభూమి మధుర అని అన్నారు. భారత రాజకీయ పరిపక్వతకు దీన్ దయాళ్ ముందు చూపు ఎంతగానో దోహదపడిందని అన్నారు.

 Prime minister Narednra Modi addresses rally in Mathura

ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రధాని మోడీ తమ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిందని, తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.

30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి ప్రజలు సంవత్సరం క్రితం నిర్ణయం తీసుకున్నారని అన్నారు.పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని, పేదల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పారు.

బ్లాక్‌ మార్కెట్‌లో గ్యాస్‌ అవినీతిని అరికట్టామని, ప్రభుత్వ సబ్సిడీని నేరుగా వినియోగదారుడికి అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం పోయిందని, యూపీఏ ప్రభుత్వం దేశాన్ని దారుణంగా లూటీ చేసిందని మోడీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

ఎన్డీయే పాలనలో నేతల కొడుకులు, అవినీతి అల్లుళ్ల కథలు లేవని గుర్తు చేశారు. గడిచిన 60 ఏళ్లలో దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు.

దేశంలో చెడ్డ రోజులు, చెడ్డ పనుల నుంచి ప్రజలకు 365 రోజుల్లో విముక్తిని కల్పించామని అన్నారు. గాంధీ, లోహియా, దీన్‌దయాళ్‌ ఈ ముగ్గురి ఆలోచనలను పంచుకుందామని అన్నారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద పేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

మధురలో ఏర్పాటు చేసిన ఈ 'జన కళ్యాణ్ పర్వ' ప్రచార సభలో మోడీ ప్రసంగాన్ని వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

English summary
As Modi government completes 365 days of governance, since it came to power, following a landslide victory in Lok Sabha election in May 2014, the Prime Minister Narendra Modi is addressing a mega rally at Mathura in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X