వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేథిలో ఐఐఐటీ: ప్రియాంక ప్రశ్నకు ధీటైన జవాబిచ్చిన స్మృతి ఇరానీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంగ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథిలో ఇప్పటి వరకు ఐఐఐటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

 Priyanka Gandhi

ప్రియాంక తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రాయ్ బరేలీ, అమేథిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తన ప్రశ్నకు తప్పక సమాధానం చెప్పి తీరాలని అన్నారు. అమేథికి ఏదో చేయాలని అనుకుంటున్న ఆమె ఐఐఐటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.

విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖను నిర్వహిస్తున్నా, ఐఐఐటీ విషయాన్ని ఆమె ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథిలో పర్యటించిన స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

 Priyanka Gandhi hits out at Smriti Irani, asks why no IIIT in Amethi

అమేథి పుడ్ పార్క్ విషయంపై ప్రియాంక మాట్లాడుతూ దానిపై తన వద్ద ఎలాంటి సరైన సమాచారం లేదన్నారు. తనపై ప్రియాంక గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. అమేథీలో ఐఐఐటీ గురించి ప్రస్తావిస్తూ, ప్రియాంక సరైన హోం వర్క్ చేయకుండా అమేథి వెళ్లారని అన్నారు.

ఐఐఐటీ అలహాబాద్‌కు చెందిన ఒక ఆఫ్ క్యాంపస్ అమేథీలో ఉందని ఆమె గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అమేథీలో గెలిచిన అభ్యర్థి, ఓడిపోయిన తనన్ని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా అడుగుతున్నారని మంత్రి ప్రశ్నించారు.

గత 60 సంవత్సరాలుగా అమేథి, రాయ్ బరేలీ నియోజక వర్గాలు గాంధీ కుటుంబానికి కంచు కోటల్లాగా ఉన్నా, ఏమీ చేసిన పాపాన పోలేదని, ఇది అత్యంత దారణమని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ లోపం గురించి తెలిసే, ఆయన తన సొంత గడ్డపై తనను తాను రక్షించుకోలేక, అదనపు ఆయుధాలను (చెల్లెలు ప్రియాంక) తెచ్చుకున్నారా అని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.

English summary
Congress president Sonia Gandhi's daughter Priyanka Gandhi on Wednesday advised HRD minister Smriti Irani to concentrate on her core work and improve the state of education in the country. The 43-year-old hit out at Irani, saying, "The minister is answerable as to why there is still no IIIT in Amethi."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X