వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నలిచ్చిన పిటి ఉష

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పిటి. ఉష భారత్‌‌లో పరిచయం అక్కర్లేని పేరు. మళ్లీ ఈ పరుగుల రాణి ట్రాక్ మీదకు రాబోతుంది. ప్రస్తుతం ఆమె గుజరాత్‌లో దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

ప్రధాని నేరంద్రమోడీ గుజరాత్‌లో కొంతమంది బాలలను ముందుగా గుర్తించి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి పిటి. ఉష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుజరాత్ నుంచి మంచి అథ్లెట్లను తయారుచేసేందుకు పిటి. ఉష సేవలను వినియోగించుకోవాలని ప్రధాని నేరంద్రమోడీ భావించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోడీ గుజరాత్ అథ్లెట్లకు శిక్షణ ఇవ్వాలని కోరారని, వడోదరలో ఉన్న శిక్షణ సదుపాయాలు బాగున్నాయని, దీన్నో సవాల్ లా స్వీకరిస్తున్నానని ఉష మీడియాకు తెలిపారు.

PT Usha accepts Modi's invite to get Gujarat athletes up and running

ఇందులో భాగంగా గుజరాత్‌ 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వాళ్లకు ప్రాథమిక శిక్షణ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి వాళ్లను పిటి ఉష తీర్చిదిద్దుతారు. దీనికోసం గాను 10 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలను ఎంపిక చేయనున్నారు. ఈ సెలక్షన్ విధానం నవంబర్ 9 నుంచి 15 వరకు గుజరాత్‌లో ఉన్న ప్రధాన పట్టణాల్లో జరగనున్నాయి.

సియోల్ ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో ఎగిరేలా చేసింది పిటి. ఉష. ఇప్పటికే కేరళలోని తన ఊరికి సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌ను నిర్వహిస్తుంది. ఇటీవల దక్షణి కొరియాలోని ఇంచియాన్‌ జరిగిన ఆసియా గేమ్స్‌లో 400మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిన టింటూ లూకా, జెస్సీ జోసెఫ్, సెర్బానా సిద్దికీ ముగ్గురు మంచి ప్రతిభను చూపించారు.

ఐతే కేరళ ప్రభుత్వం ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌‌ స్కూల్‌ను పెట్టేందుకు స్దలం కేటాయించిన ప్రభుత్వం, దాని నిర్వహణకు అయ్యే ఖర్చులను చెల్లించడంలో విఫలమైందని వాపోయింది. ఒక జూనియర్ అథ్లెట్‌ను తయారు చేసేందుకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ. 2 లక్షలు అవుతుందని అన్నారు. కొత్త మంది స్పాన్సర్లు దాతృత్వముగా వారి పర్సులు నుంచి సులభం డబ్బుని ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

English summary
India’s most successful sprinter, PT Usha, is set to take on a marathon mission to scout and groom sporting talent in Gujarat, in response to a request from Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X