వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్: భార్యలపై భర్తల 146 ఫిర్యాదులు, ఏం చేయాలి?

భర్తలపై భార్యలు ఫిర్యాదులు చేయడం చూస్తుంటాం, వింటూంటాం. కానీ, భార్యలపై భర్తలు ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతోంది. మహరాష్ట్రలోని పూణెలోని మహిళ పోలీస్ స్టేషన్ లో భార్యల ప్రవర్తనపై భర్తలు ఫిర్యాదుల.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పూణె: భర్తలపై భార్యలు ఫిర్యాదులు చేయడం చూస్తుంటాం, వింటూంటాం. కానీ, భార్యలపై భర్తలు ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతోంది. మహరాష్ట్రలోని పూణెలోని మహిళ పోలీస్ స్టేషన్ లో భార్యల ప్రవర్తనపై భర్తలు ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ఈ విషయమై ఐదు మాసాల వ్యవధిలో 146 మంది భర్తలు తమ భార్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు.

తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకొందని, నిత్యం సెల్ ఫోన్లతో మాట్లాడుతూ తనను పట్టించుకోవడం లేదని భర్తలే మహిళ పోలీసు విభాగానికి ఫిర్యాదులు చేశారు.

Pune’s police women’s cell receives 146 complaints filed by men in five months

ఢిల్లీ శివార్లలో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ఫ్రోసిజర్ లలో సవరణలు తీసుకురావడంతో పురుషులు తమను వేధించారని, అత్యాచారం చేశారని మహిళలు ఫిర్యాదులు చేస్తే చాలు పురుషులపై కేసులు నమోదుచేస్తారు.

అయితే కొందరు మహిళలు తమ భర్తలపై తప్పుడు కేసులు బనాయించారనే ఆరోపణలు కూడ లేకపోలేదు.ఈ మేరకు పురుషుల హక్కుల సంఘాలు ఆరోపణలు కూడ చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే అన్ని కేసులను కూడ ఒకేగాటిన కట్టలేం.

ఇదిలా ఉంటే మహరాష్ట్రలోని పూణెలో మాత్రం మహిళా పోలీసు విభాగానికి గడిచిన ఐదు మాసాల్లో 837 ఫిర్యాదులు అందాయి. వాటిలో 146 కేసులు భార్యలకు వ్యతిరేకంగానే భర్తలు ఫిర్యాదులు చేశారు.

ఈ ఏడాది జనవరిలో 24, ఫిబ్రవరిలో 23, మార్చిలో 49, ఏప్రిల్ లో 25, మే లో 25 చొప్పున తమ భార్యలపై భర్తలు ఫిర్యాదులు చేశారు. కొందరు భార్యలు అనుమానాస్పదంగా ప్రవర్తించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, తనకు ప్రత్యేకంగా ఇల్లు నిర్మించాలనే డిమాండ్ చేయడం వంటి కారణాలతో భర్తలు తమ భార్యలపై ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై ఏం చేయాలనే దానిపై పోలీసులు ఆలోచిస్తున్నారు.

English summary
According to the women’s cell functional at the Pune police commissionerate, the city has been receiving a steady number of male complainants over the past few months. Of the 837 complaints received by the women’s cell in the last five months, 146 complaints were registered by men.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X