వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో పడిపోయిన ఎమ్మెల్యేలు, మార్షల్స్ తీసుకెళ్లడంతో గాయాలు

పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు లాక్కు వచ్చారు.ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు స్వల్పంగా గాయాలయ్యాయి.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు లాక్కు వచ్చారు. ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు స్వల్పంగా గాయాలయ్యాయి.

అసెంబ్లీలో గురువారం గందరగోళం ఏర్పడింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీల ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటికి పంపేశారు.

ఏఏపీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ ఖైరా, ఎల్‌ఐపీ నేత సిమర్ జీత్‌ సింగ్‌ను అసెంబ్లీలోనికి రానివ్వకపోవడంతో గురువారం ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని పోడియం పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు.

Punjab Assembly ruckus: AAP MLAs thrown out of House, injured rushed to hospital

ఈ గందరగోళంలో నలుగురు ఏఏపీ నేతలు కళ్లు తిరిగి పడిపోయారు. దాంతో స్పీకర్‌ రానా కేపీ సింగ్‌ వారందరినీ సస్పెండ్‌ చేశారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. దీంతో కొందరికి స్వల్పంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సుఖ్‌పాల్‌, సిమర్‌జీత్‌లు అసెంబ్లీ బయట ధర్నా చేపట్టారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు.
జూన్‌ 16న సుఖ్‌పాల్‌ ఖైరా అసెంబ్లీలో జరిగిన గొడవని ఫేస్‌బుక్‌ లైవ్‌లో వీడియో తీసినందుకు, సిమర్‌జీత్‌ జూన్‌ 15న స్పీకర్‌పై పేపర్లు విసిరినందుకు వారిద్దరినీ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు.

English summary
Punjab Assembly ruckus: AAP MLA Manjeet Singh Bilaspur from Nihal Singhwala constituency fell unconscious and had to be rushed to a hospital along with other injured MLAs. Akali Dal MLAs came out in support of their colleagues in the Opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X