వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో సెక్స్ స్వేచ్చ రావాలి.. మళ్లీ న్యూడ్ గా నటిస్తా: రాధికా ఆప్టే (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

ముంబై : సినిమా మార్కెటింగ్ కోసం చెబుతోన్న మాటలో.. లేక నిజంగానే భారతీయ స్త్రీల సెక్సువాలిటీపై జాలిపడుతున్నారో తెలియదు గానీ.. సెక్స్ కామెంట్స్ తో మీడియాను మాత్రం తమవైపు తిప్పుకోవడంలో సఫలమవుతున్నారు పర్చేడ్ సినిమా టీమ్. ముఖ్యంగా రాధిక ఆప్టే, ఆదిల్ హుస్సేన్ ల ఇంటర్వ్యూలు, కామెంట్స్ విషయాన్ని ఎక్కువగా చర్చల్లో నానేలా చేస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా ఆప్టే.. 'తన శరీరం పట్ల తనకు పూర్తి స్వేచ్చ ఉందని, భారత్ లో శృంగార స్వేచ్ఛ రావాల్సిన సమయం ఆసన్నమైందని' పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యూడ్ సీన్లకు సంబంధించి మీడియా అడుగుతోన్న ప్రశ్నల అసహనం వ్యక్తం చేస్తోన్న రాధికా ఆప్టే తాజాగా మరిన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

భర్త ఓకె చెప్పాకే.. న్యూడ్ సీన్స్ :

భర్త ఓకె చెప్పాకే.. న్యూడ్ సీన్స్ :

పర్చేడ్ సినిమాలోని కొన్ని సెక్స్ మరియు న్యూడ్ సీన్లలో నటిస్తోన్న విషయాన్ని ముందే తన భర్తకు చెప్పానని, భర్త అంగీకరించాకే ఆ సీన్లు చేశానని చెప్పుకొచ్చింది రాధికా. ఈ విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహాం మరువలేనిది అని చెప్పింది.

గతంలోనూ ఇలాగే :

గతంలోనూ ఇలాగే :

తాను నటించిన 'క్లీన్ షేవ్' సినిమా విషయంలో కూడా ఇలాగే లీకేజీ జరిగిందని.. ఆ సీన్లపై మీడియా దుమ్మత్తి పోస్తుంటే కోపం వచ్చిందని, ఇప్పుడు పర్చేడ్ సినిమా విషయంలోను అలాగే జరిగిందని చెప్పుకొచ్చింది రాధికా.

నేనెందుకు ఫీలవ్వాలి?

నేనెందుకు ఫీలవ్వాలి?

న్యూడ్ సీన్లు లీకైన విషయం నిర్మాత చెబితే తెలిసిందని, తొలుత కోపం వచ్చినా.. ఇప్పుడు మాత్రం నవ్వొస్తుందంటోంది రాధికా. సెక్స్ లేదా న్యూడ్ సీన్లు చేసేప్పుడు తన శరీరం సౌకర్యంగానే ఉందని, ఈ విషయంలో తానేమి ఫీలవట్లేదని చెప్పింది.

రాధికావే ఎందుకు లీకవుతున్నాయంటే?:

రాధికావే ఎందుకు లీకవుతున్నాయంటే?:

తను న్యూడ్ సీన్లు చేస్తున్నాను కాబట్టే తన సీన్లు లీకవుతున్నాయని, అదే సమయంలో.. ఓ మహిళ న్యూడ్ సీన్లలో నటించేటప్పుడు మగాడి దృష్టి అనేది మహిళ మీదే ఉండడం సహజం అని పేర్కొంది రాధికా.

'న్యూడిటీ' ఎంతవరకు అవసరమో!

'న్యూడిటీ' ఎంతవరకు అవసరమో!

పొట్టి దుస్తుల్లో డ్యాన్సులు చేసినంత మాత్రాన జనం దాన్ని అసభ్యత అనుకోవచ్చు.. కానీ దాన్ని ఓ కళగా చూసినప్పుడే అందులో అసభ్యత కనిపించదంటోంది రాధికా. సినిమా అవసరం మేరకే 'న్యూడిటీ'కి ఒప్పుకుంటానని తెలిపింది.

న్యూడ్ సీన్లే స్ఫూర్తి

న్యూడ్ సీన్లే స్ఫూర్తి

20ఏళ్లకే శరీర అవయవాలపై స్పష్టమైన అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చిన రాధికా.. తన ముందు తరం తారలు న్యూడ్ సీన్లలో నటించడం తనకు స్ఫూర్తినించిదని చెప్పింది.

మళ్లీ న్యూడ్ గా నటిస్తా:

మళ్లీ న్యూడ్ గా నటిస్తా:

అవకాశం వస్తే.. మరోసారి న్యూడ్ గా నటించడానికి రెడీ అని చెప్పింది రాధికా. అంతకుముందు సినిమా ద్వారా న్యూడ్ సీన్లలో నటించడాన్ని ఫ్రీ గా ఫీలవుతున్నానని అన్నది. న్యూడ్ గా నటించడంలో నాకేమి తేడా అనిపించదు అని తేల్చేసింది రాధికా.

English summary
Radhika Apte is a perfect example of 'Bold & Beautiful.' Recently, the sex scenes from her film, Parched leaked online but the actress doesn't give a damn about it! In an interview with Spotboye, Radhika's co-star Adil Hussain revealed that they are not at all worried about it!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X