వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో రాహుల్ గాంధీపై రాళ్ల దాడి, పగిలిన కారు అద్దాలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్ పైన గుజరాత్‌లో దాడి జరిగింది. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శ కోసం వెళ్లారు.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్ పైన గుజరాత్‌లో దాడి జరిగింది. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శ కోసం వెళ్లారు.

అప్పుడు పలువురు ఆయన కాన్వాయ్ పైన రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం నాడు బనస్కంత జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో కారు దెబ్బతిన్నది. అద్దం పగిలింది.

Rahul Gandhi’s car attacked in Gujarat’s flood hit Banasakantha

కానీ రాహుల్ గాంధీకి ఏమీ కాలేదు. ఆ సమయంలో రాహుల్ ముందు సీట్లో కూర్చున్నాడు. రాహుల్ ఎస్పీజీ కమాండోస్ రక్షణలో వెళ్తున్నాడు. ఎస్పీజీ కమాండోలు స్వల్పంగా గాయపడ్డారని తెలుస్తోంది.

బిజెపి గూండాలు రాహుల్ గాంధీ కారుపై లాల్ చౌక్ వద్ద రాళ్లతో దాడి చేశారని, కారు విండో అద్దాలు పగిలిపోయాయని, సెక్యూరిటీ స్టాఫ్ గాయపడిందని, నిజాన్ని దాచలేమని బిజెపి గుర్తించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.

Rahul Gandhi’s car attacked in Gujarat’s flood hit Banasakantha

మరోవైపు, ఈ ఘటనతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని బిజెపి నేత జగదాంబికా పాల్ అన్నారు. ఈ వార్తలు అవాస్తవం అని, దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అన్నారు. దీని వెనుక బిజెపి ఉందని తాము భావించడం లేదన్నారు.

English summary
Congress vice-president Rahul Gandhi’s car was pelted with stones while he was travelling during his tour to the flood-affected Banaskantha district of Gujarat on Friday. Window panes of the car were broken in the attack, but Rahul Gandhi escaped unhurt as he was sitting in the front seat. Rahul was travelling with SPG commandos some of whom were reportedly injured in the attack as they were sitting in the back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X