వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా తప్పుకోవాలి, రాహుల్ రావాలి: దిగ్విజయ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తల్లి సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీని పునరుత్తేజం చేయాల్ిసన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావడానికి ఇంకా సమయం రాలేదనే వాదనలను ఆయన ఖండించారు. ప్రస్తుతం పార్టీ అత్యంత దారుణమైన స్థితిలో ఉందని అంతా అంగీకరిస్తున్నారని, కానీ సిపిఎం, ఆర్జెడీ లాంటి పార్టీలు మునిగిపోతున్నా ఎవరూ పట్టించుకోరు ఎందుకని ఆయన అన్నారు.

Rahul Gandhi should take over from Sonia: Digvijaya Singh

జవహర్‌లాల్ నెహ్రూ 38 ఏల్ల వయసులో కాంగ్రెసు అధ్యక్షుడయ్యారని, మౌలానా ఆజాదే అయితే 35 ఏళ్లకే పదవి చేపట్టారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి ఇంతకు మించిన మంచి సమయం దొరకబోదని ఆయన అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఆ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎల్లవేళలా కాంగ్రెసు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిందని, ఆయన అన్నారు. ఎన్నికల్లో జయాపజయాలు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమని, దానికి ఎవరినో బాధ్యలను చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు సంస్థాగతంగా పునర్వ్యస్థీకరణ చేపట్టే తరుణంలో దిగ్విజయ్ సింగ్ నాయకత్వ మార్పుపై వ్యాఖ్యలు చేశారు.

English summary
Just as Congress set the ball rolling on internal elections, party veteran Digvijaya Singh has demanded that Rahul Gandhi take over the reins from mother Sonia, arguing it is time for the young leader to assume command and rejuvenate the organization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X