వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16కిమీ కాలినడక: కేదార్‌నాథ్ ఆలయానికి రాహుల్ ఇలా... (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక్కసారిగా దైవభక్తి వచ్చేసింది. హిందూ దేవాలయాలలో అత్యంత ప్రసిద్ది చెందిన కేదారనాథ్ పుణ్యక్షేత్రం చేరుకున్నారు. తనను కాపాడు స్వామీ అంటూ దేవుడికి ప్రార్థనలు చేసుకున్నారు.

రాహుల్ గాంధీ భాషలో చెప్పాలంటే ఇది ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. ఆమ్ ఆద్మి బాషలో చెప్పాలంటే చలో గౌరి కుండ్ అని అనవచ్చు. సుమారు 55 రోజుల పాటు సోంత పార్టీ సీనియర్ నాయకుల చేతికి చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లి తీవ్ర చర్చకు దారితీసిన రాహుల్ గాంధీ ఇదే నెల ప్రత్యక్షం అయ్యాడు.

తరువాత ఢిల్లీలో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత పార్లమెంట్ సమావేశాలలో పాల్గోని బీజేపీ మీద నిప్పులు చెరిగారు. వెంటనే ఆయన కేదారనాథ్ దేవాలయం వైపు ప్రయాణించారు. యువరాజుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అంబిక సోని, వందలాధి మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంట ఉన్నారు.

రాహుల్ తీర్థ యాత్ర

రాహుల్ తీర్థ యాత్ర

గురువారం ఉదయం రాహుల్ గాంధీ గౌరికుండ్- కేదారనాథ్ మార్గంలోని 16 కిలో మీటర్ల దూరం కాలి నడకన ప్రయాణం చేశారు. గురువారం 5 కిలో మీటర్లు నడిచిన రాహుల్ గాంధీ రాత్రి లించోలిలో బసచేశారు.

రెడి గో అన్న రాహుల్

రెడి గో అన్న రాహుల్

శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మళ్లి లించోలి నుండి కేదారనాథ్ యాత్ర ప్రారంభించారు.

యువరాజుకు సీఎం తోడు

యువరాజుకు సీఎం తోడు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, అంబికా సోని తదితరులు యువరాజు వెంట వెళ్లారు. ఆమ్ ఆద్మి తరహాలో రాహుల్ ఈ విధంగా యాత్రలు చేస్తున్నారు.

చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

గౌరికుండ్ తదితర చోట్ల సుందరమైన ప్రాంతాలు చూస్తున్న యువరాజు చుట్టు భద్రతా బలగాలు మోహరించాయి.

ప్రత్యేక శ్రద్ద తీసున్న కాంగ్రెస్

ప్రత్యేక శ్రద్ద తీసున్న కాంగ్రెస్

రాహుల్ కేదారనాథ్ యాత్ర వివరాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటి కప్పుడు ట్విట్టర్, సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.

English summary
The Congress leader will start his yatra from Gaurikund thursday, along with a number of political leaders and others. He will stay overnight en route and will offer prayers at the Kedarnath temple after 8:30 am on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X