వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యాను టార్గెట్ చేయండి: రాహుల్, మోడీని అంతమొందించే కుట్ర

ప్రధాని నరేంద్ర మోడీ పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నిప్పులు చెరిగారు. పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు అండగా నిలబడటం మానివేయాలని, అదే సమయంలో పేదలు, బడుగువర్గాలు, రైతుల కోసం ఎంతో కొంత మేలు చ

|
Google Oneindia TeluguNews

డియోరియా: ప్రధాని నరేంద్ర మోడీ పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నిప్పులు చెరిగారు. పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు అండగా నిలబడటం మానివేయాలని, అదే సమయంలో పేదలు, బడుగువర్గాలు, రైతుల కోసం ఎంతో కొంత మేలు చేయాలని హితవు పలికారు.

యూపీలోని డియోరియాలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్, పేదలు, నిజాయతీపరులు, కష్టపడి పనిచేసే ప్రజలను ఏమాత్రం ఖాతరు చేయని ప్రధాని మోడీ దేశంలోని 50 సంపన్న కుటుంబాలకు లబ్ది చేకూర్చేందుకే అహర్నిషలు కృషి చేస్తున్నారని విమర్శించారు.

Rahul to PM Modi: Target Mallya, not poor of UP

రూ.1,200 కోట్ల రూపాయల మేరకు మాల్యా బకాయిలను ఎలా రద్దు చేశారని మోడీని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు చేతినిండా పని, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారన్నారు. యూపీలో మార్పు కోసమే అఖిలేష్, తానూ కలిసి పని చేస్తున్నామన్నారు.

మోడీని అంతమొందించే కుట్ర

ప్రధాని మోడీని అంతమొందించడానికి కుట్ర జరిగింది. యూపీలోని మవూలో సోమవారం ఎన్నికల సభలో మోడీ ప్రసంగిస్తారని తెలిసి.. ఆయన వాహనశ్రేణిపై రాకెట్‌ లాంఛర్‌తో కాని పేలుడు పదార్థాలున్న వాహనంతో కాని దాడి చేయాలని కుట్ర జరిగింది.

మవూ ఏఎస్‌పీ ఆర్‌కె సింగ్‌ ఆదివారం సాయంత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసులో నిందితుడైన రసూల్‌ పట్టి, అతని అనుచరులు ఈ కుట్ర పన్నారు. దీంతో ప్రధాని మోడీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

English summary
Congress vice president Rahul Gandhi called on Prime Minister Narendra Modi to stop protecting absconding liquor baron Vijay Mallya, and instead do something for the poor, deprived and farmers of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X