వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: ఛార్జీలు పెంచలేదు కానీ.., వీటితో పాసింజర్లకు హ్యాపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన విపక్షాలతో పాటు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు కొత్త రైళ్లను ప్రకటిస్తామని ప్రభు చెప్పారు.

ఛార్జీలు పెంచడం లేదంటూనే దొడ్డిదారిన మోత మోగించనున్నాయని చెబుతున్నారు. సరకు రవాణా చార్జీల్లో సవరణలు ఉంటాయని చెప్పారు. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు తదితర రవాణా చార్జీలు పెరగవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుండి సరకు రవాణా ఛార్జీలు పెరుగుతాయి.

మరోవైపు రైల్వే బడ్జెట్ నేపథ్యంలో.. ప్రయాణీకులను సంతోషపెట్టే పలు అంశాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయని చెప్పవచ్చు.

Rail Budget 2015: 15 Best Takeaways

ప్రయాణ ఛార్జీలు పెరగడం లేదు
నాలుగు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్
డిస్పోజబుల్ బెడ్ రోల్స్ కోసం ఆన్ లైన్ బుకింగ్
పలు భాషల్లో ఈ-టిక్కెటింగ్, యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్స్
టిక్కెట్లు తొందరగా తీసుకునేందుకు... ఆపరేషన్ 5 మినట్స్
ముందుగానే మీల్స్ ఆన్ లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం
ఎస్కలేటర్స్, ఆన్‌లైన్ వీల్ చైర్లు, వెడల్పుగా ఉండే ఎంట్రన్సులు
ఇస్రో సహకారం
400 స్టేషన్లలో వైఫై
17,000 టాయిలెంట్స్‌ను బయోటాయిలెట్స్‌గా..
వెండింగ్ మిషన్ ద్వారా తక్కువ ధరకు మంచి నీరు
సబర్బన్ ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్స్
దేశవ్యాప్తంగా 24 X 7 హెల్ప్ లైన్ '138' మార్చి 1 నుండి. భద్రత ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ '182'
రైళ్ల రాకపోకలపై ఎస్సెమ్మెస్ అలర్ట్
రైల్వే స్టేషన్ల వద్ద పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ
గుర్తించిన రైళ్లకు బోగీలు పెంచడం

English summary
Presenting the first full-fledged Rail Budget of the Modi government for 2015-16, Railway Minister Suresh Prabhu spared passengers from any hike in fares but made changes in freight rates to rake in more money while ruling out privatisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X