వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: అంకెల్లో ఇండియన్ రైల్వే.., తెలుగు రాష్ట్రాల కోటి ఆశలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం నాడు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేకు సంబంధించి అంకెల్లో కొన్ని విషయాలు...

23 మిలియన్లు.. ప్రతి రోజు రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు. ఇందుకోసం రైల్వే శాఖ 12,617 రైళ్లను నడుపుతోంది. భారత దేశంలో 7,172 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

రూ.1.4 లక్షల కోట్లు.. రైల్వేకు ప్రతి ఏటా వచ్చే రెవెన్యూ.

359 రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు అవసరం అవుతాయి.

గత మూడు దశాబ్దాలుగా 676 ప్రాజెక్టులు సాక్షన్ అయ్యాయి. అందులో 317 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

ప్రతి ఏటా ప్రయాణీకుల ఛార్జీలు ఎక్కువగా పెంచకపోవడం లేదా తగ్గించడం ద్వారా రైల్వే శాఖ ప్రతి ఏటా రూ.26,000 నష్టపోతోంది.

Railway Budget 2015: Indian Railways in numbers

రైల్వే శాఖ 67 శాతం సరుకు రవాణా ద్వారా ఆర్జిస్తోంది.

ప్రతి రోజు రైల్వేలు 2.65 మిలియన్ల టన్నుల కార్గోను రవాణా చేస్తోంది.

ఇండియన్ రైల్వేస్ యొక్క ఆపరేటింగ్ రేషియా 94 శాతంగా ఉంది. అంటే ప్రతి వంద పైసల్లో రైల్వే శాఖ 6 శాతం మాత్రమే ఆదా చేయగలుగుతోంది.

స్వతంత్రం వచ్చాక రైల్వేలు ప్రతి ఏటా యావరేజ్‌గా 200 కిలోమీటర్లు పెరుగుతూ వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆశలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రైల్వే బడ్జెట్ కేటాయింపుల పైన కోటి ఆశలతో ఉన్నాయి. ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే టాప్‌లో ఉన్నప్పటికీ కేటాయింపుల్లో మాత్రం దాదాపు చివరిస్థానంలో ఉంటోంది. దశాబ్దాలుగా ఎన్నో కదలని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఏపీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఏపీలో ఓ జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

English summary
Railway Minister Suresh Prabhu will present his first Budget on Thursday. Here are some numbers related to the Railway Budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X