వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవుల సంరక్షణ: దేశ వ్యాప్తంగా కామధేను నగర్స్‌కు ఆర్ఎస్ఎస్ సంకల్పం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిందూ మతాన్ని దాని పవిత్రను కాపాడే విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎప్పుడూ ముందుటుంది. తాజాగా హిందూ మతంలో అతి పవిత్రంగా భావించే గోవుల సంరక్షణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 'కామధేను నగర్' పేరిట 120 ప్రత్యేక ఆవాసాలను నిర్మించేందుకు సంకల్పించింది.

మనుషులు నివసించే జనావాసాలకు అనుబంధంగానే ఈ కామధేను నగర్‌‌లను ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఇలా చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఆవులపై నేరాలు, సంస్కరణ దోషులు తగ్గించేందుకు సహాయం చేస్తుందని భావిస్తున్నారు.

వీటితో పాటు గోశాలలకు అనుబంధంగా 80 'గోకుల్ గురుకుల్' పాఠశాలలను కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధ అఖిల భారత గో సేవ అధ్యక్షుడు శంకర్ లాల్ మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో ఆవు కూడా ఒక భాగం అయినప్పుడు మాత్రమే దాన్ని రక్షించగలమని అన్నారు.

 Rashtriya Swayamsevak Sangh

ఆవుల కోసం ప్రత్యేకించి తలపెట్టన ఈ కామధేను నగర్‌ల కోసం గేటెడ్ కమ్యూనిటీ, కాలనీలతో ఈ చర్చలు జరపుతున్నామని అన్నారు. ఈ గోశాలల ద్వారా పాలు, పాల పదార్దములు, ఔషధాలు, గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి అదే కాలనీలకు అందిస్తామని చెప్పారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో 100కు పైగా స్ధలాలను గుర్తించిందన్నారు. ఆవు పాలు తాగడం ద్వారా మనుషుల్లో క్రూరత్వం తగ్గి, క్రైమ్ రేట్ తగ్గుతుందని శంకర్ లాల్ తెలిపారు. నేర రహిత భారత్ కోసం చిన్నారులు భారత గోవుల పాలను మాత్రమే తాగాలని ఆయన పిలుపునిచ్చారు.

గత 60 సంవత్సరాలుగా 70 కోట్లు ఉన్న ఆవుల సంఖ్య 15 కోట్లకు చేరిందన్నారు. చాలా మంది వ్యాపారవేత్తలు ఆవుల సంరక్షణకు తమవంతుగా చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. మా వద్ద ఉన్న 18 పాయింట్ల ఏజెండాను సంఘ్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎన్టీవోలకు పంపడం జరిగిందన్నారు.

ఆవుల గురించి మతపరమైన, సాంఘిక ప్రాముఖ్యతను గురించిన జ్ఞానాన్ని విద్యార్థుల్లో పరీక్షించడానికి 'గౌగయాన్ పరీక్షా' ప్రతి సంవత్సరం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సంఘ్ చర్చలు జరిపిందని చెప్పారు. ఇటీవలే ఇలాంటి పరీక్షను రాజస్థాన్ రాష్ట్రం నిర్వహించిందని తెలిపారు.

English summary
Rashtriya Swayamsevak Sangh wants to build 120 Kamadhenu Nagars in India in the next few months as part of overall efforts to venerate the sacred animals and make their life more comfortable, besides bringing them closer to the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X