వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించిన మాఫియా డాన్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: డబ్బులివ్వకపోతే నీ అంతు చూస్తామని ఒక శాసన సభ్యుడికి మాపియా ముఠా నాయకుడు బెదిరించాడని.. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాం దక్షిణ శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు సంభాజీ పాటిల్‌కు బెదిరింపు ఫోన్లు వచ్చాయి.

సంభాజీ పాటిల్.. బెల్గాం నగర పోలీసు కమిషనర్ రవికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) పార్టీ నుండి సంభాజీ పాటిల్ శాసన సభ్యుడిగా గెలుపొందారు.

బుధవారం మద్యాహ్నం 12.43 గంటలకు, ఆ తర్వాత ఒకటి గంటల సమయంలో సంభాజీ పాటిల్ మొబైల్‌కు మిస్‌డ్ కాల్స్ వచ్చాయి. తరువాత మద్యాహ్నం 1.40 గంటల సమయంలో ఒకరు ఫోన్ చేసి నేను మంగళూరుకు చెందిన రవి పూజారి (కర్ణాటకలో పెద్ద మాఫియా డాన్) మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.

మహారాష్ట్రలోని అనేక కంపెనీలలో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదిస్తున్నావని, నేను చెప్పినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుందని బెదిరించాడని శాసన సభ్యుడు సంభాజీ పాటిల్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తాను ఆస్ట్రేలియాలో ఉన్నానని రవి పూజారి చెప్పాడని సంభాజీ పాటిల్ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.

 Ravi Pujari telephones MLA from Australia, seeking financial help

సంభాజీ పాటిల్‌కు వచ్చిన ఫోన్ నెంబర్ 0+ 6666874044 ఏ దేశానికి చెందినదని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా, మాఫియా డాన్ రవి పూజారి అనేక సంవత్సరాల నుండి విదేశాలలో తలదాచుకుంటున్నాడు. అతనికి బెంగళూరు, మంబై, మంగళూరు, హుబ్బళి, బెల్గాం తదితర నగరాలలో అనేకమంది అనుచరులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, శ్రీమంతల ఫోన్ నెంబర్లు సేకరించి రవి పూజారికి అందిస్తుంటారు.

విదేశాల నుండి రవి పూజారి ఇక్కడ ఉన్న వ్యాపారులను బెదిరించి తన అనుచరుల దగ్గర నగదు వసూలు చేయించి విదేశాలలోని బ్యాంకు అకౌంట్ లలో జమ చేయించుకుంటున్నాడు. ఎదురు తిరిగిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను రవి పూజారి తన అనుచరులతో రివాల్వర్లతో కాల్పించి హత్య చేయించిన సంఘటనలు చాలానే ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. సంభాజీ పాటిల్‌కు ఎక్కడి నుండి ఫోన్ చేయించారు, ఎంత డబ్బు డిమాండ్ చేశారు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Ravi Pujari telephones MLA from Australia, seeking financial help
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X