నువ్వు లేని ఈ జీవితం నాకెందుకు, వెళ్లిపోతున్నా: రవి మెసేజ్‌లు లీక్

Posted by:
Published: Thursday, March 26, 2015, 14:10 [IST]
 

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు కొత్త మలుపు తిరిగింది. మహిళా ఐఏఎస్ అధికారిని ప్రేమించిన రవి, ఆమె దూరం అయ్యిందని, తన కోర్కె తీరలేదని ఆత్మహత్య చేసుకున్నాడని ‘ప్రజావాణి 'అనే కన్నడ దిన పత్రిక గురువారం వార్తను ప్రచురించింది.

రవి ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన మొబైల్ నుండి మహిళ ఐఏఎస్ అధికారికి వాట్సప్ లో సుదీర్ఘంగా మెసేజ్ పంపించారని, ఆ మెసేజ్ వివరాలు తమ చేతికి అందాయని ‘ ప్రజావాణి ' దిన పత్రిక ప్రచురించింది. ఆ దినపత్రిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి - మార్చి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4.25 గంటల సమయంలో రవి మహిళ ఐఏఎస్ అధికారికి ఒక మెసేజ్ పంపించాడు.

‘ఈ రోజు ఒక దురదృష్టకరమైన నిర్ణయం తీసుకున్నాను. నన్ను నీవు నమ్ముతున్నానని అనుకుంటున్నాను. నీవు ఫోన్ చేస్తావని, నన్ను ఆహ్వానిస్తావని ఈ రోజు రాత్రి 9 గంటల వరకు ఎదురు చూస్తాను' అని మెసేజ్ పంపించాడు. తరువాత సాయంత్రం 5.20 గంటల సమయంలో మళ్లి ఆమెకు మెసేజ్ పంపించాడు. ‘నీవు నాకు ఫోన్ చెయ్యోద్దు, నాతో మాట్టాడటానికి ప్రయత్నం చెయ్యోద్దు, నా ప్రేమ గురించి ఎవ్వరితో చెప్పొద్దు, మరు జన్మ అంటూ ఉంటే అప్పుడు కలుద్దాం' అని మెసేజ్ పంపించాడు.

Ravi's messages leaked: reports

అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో మహిళ ఐఏఎస్ అధికారి ఆమె తన మొబైల్‌లోని మెసేజ్‌లు చూశారని ప్రజావాణి దినపత్రిక రాసింది. తరువాత రవికి మెసేజ్ పంపించారు. ‘ఏమిటి ఈ మెసేజ్ లు, మూర్ఖంగా ప్రవర్థించవద్దు, నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేకుంటే ఆ విషయం సూటిగా, స్పష్టంగా చెప్పు' అని ఆమె మెసేజ్ పంపించారు.

మార్చి 16వ తేది ( రవి మరణించిన రోజు) ఉదయం 9.50 గంటల సమయంలో మహిళ ఐఏఎస్ అధికారికి రవి మెసేజ్ చేశాడు. అందులో అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాననే విషయాన్ని సూటిగా చెప్పాడు.

‘బేబీ! నేను స్వార్థపరుడని కాదు, మోసగాడిని కాదు, అబద్దాలు చెప్పేవాడిని కాదు, నాకు జీవితంలో ఏదో సాధించాలని ఉంది, అది సాధించచలేనప్పుడు బ్రతికి ఉండంటం దండగ, చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాను. ఇప్పడు ఈ స్థాయిలో ఉన్నాను. అయితే జీవితంలో నేను ఓడిపోయాను, ఇక జీవితంలో ముందుకు వెళ్తాననే నమ్మకం నాకు లేదు. నేను ఈ లోకంలో ఉండలేను' అని స్పష్టం చేశాడు.

‘నీ అందం చూసి నేను ప్రేమించలేదు, నీ మనస్సు చూసి ప్రేమించాను, నేను కావాలనుకుంటే నీకంటే అందంగా ఉన్న వారితో గడపగలను, ఇప్పటికైనా నమనస్సు అర్థం చేసుకుంటావని నమ్ముతున్నా. నీవు అడగవచ్చు, నన్ను ప్రేమించి నీవు ఎందుకు వేరే ఆమెను పెళ్లి చేసుకున్నావు అని, ఆ హక్కు నీకు ఉంది' అని రవి మెసేజ్ పంపినట్లు ఆ వార్తాపత్రిక రాసింది.

‘జీవితంలో అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మన చేతిలో లేవు, నాకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నీ ప్రేమను సొంతం చేసుకొవడం, రెండు ఆత్మహత్య చేసుకోవడం, నీ ప్రేమ పోందలేనని తెలిసిపోయింది. నాకు మిగిలింది రెండవ మార్గం - ఆత్మహత్య చేసుకోవడం, నేను ఆత్మహత్య చేసుకుంటే మా కుటుంబ సభ్యులు రెండు రోజులు భాదపడి తరువాత మరిచిపోతారు. కానీ నీవు జీవితాంతం హాయిగా ఉంటావని నమ్మతున్నాను. నేను ఆత్మహత్య చేసుకున్నానని తెలుసుకున్న తరువాత అక్కడికి వచ్చి నా శవాన్ని పట్టుకుని హత్తుకుంటావని, ఒక ముద్దు పెట్టుకుంటావని నమ్ముతున్నా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది, ఇదే నా చివరి మెసేజ్' అని పంపించాడని ‘ ప్రజావాణి 'దిన పత్రికలో ప్రచురించారు.

English summary
IAS officer DK Ravi, who was found hanging in his home in Bengaluru last week, allegedly sent a woman batch-mate a text message that is likely to be treated as his suicide note?
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Subscribe Newsletter
Videos You May Like
My Place My Voice