వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు విమానంలో ప్రయాణించొచ్చు, రూల్స్ లేవన్న కేంద్రం

ఎయిరిండియా అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తపడినట్టు కన్పిస్తోంది. అన్ని విమానాల్లో రవీంద్ర గైక్వాడ్ ప్రయాణించేందుకుగాను కేంద్రం గ్రీన్ సిగ్నల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిరిండియా అధికారిపై దాడికి పాల్పడిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తపడినట్టు కన్పిస్తోంది. అన్ని విమానాల్లో రవీంద్ర గైక్వాడ్ ప్రయాణించేందుకుగాను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంలో గొడవపడిన గైక్వాడ్ , సుకుమార్ అనే ఎయిరిండియా ఉద్యోగిపై గురువారం నాడు చెప్పుతో కొట్టారు.దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.

ravindra gaikwad may soon fly again, rules may change

ఈ ఘటనలో ఎంపిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిరిండియా సహా ప్రధాన విమాన సంస్థల్లో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించారు. ఢిల్లీ నుండి పూణెకు తిరిగి వెళ్ళేందుకుగాను గైక్వాడ్ రిజర్వ్ చేసుకొన్న టిక్కెట్టును కూడ రద్దు చేశాయి.

దీంతో ఆయన రైలులో ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు శివసేన ఎంపీలు కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజు, స్పీకర్ సుమిత్రా మహాజన్ లను కలిసి గైక్వాడ్ పై నిషేధం తొలగించాలని కోరారు.

విమానాల్లో ప్రయాణించకుండా ఆపేలా చట్టం లేదని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీవీ చౌదరి చెప్పారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే విమానాల్లో ప్రయాణించేందుకు గైక్వాడ్కు అనుమతిచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.

English summary
after shiv sena mp ravindra gaikwad was banned by major airlines from flying over his assault of an air india duty manager on thursday, the government is considering changes in the rules so he can fly again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X