వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాతాదారులకు శుభవార్తే .నగదు ఉపసంహరణపై ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్దం

ఈ వారంలో బ్యాంకులు, ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణ పై ఉన్న ఆంక్షలను ఆర్ బి ఐ సమీక్షించే అవకాశం ఉంది. ఈ మేరకు ఖాతాదారులకు ఆర్ బి ఐ నుండి తీపి కబురు వచ్చే అవకాశం ఉందని ఆర్ బి ఐ వర్గాలు చెబుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఎటిఎం ల నుండి నగదు ఉపసంహరణ పరిమితిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే యోచనలో ఆర్ బి ఐ ఉంది. ఈ మేరకు ఈ వారంలో ఈ విషయమై ఖాతాదారులకు ఆర్ బి ఐ తీపికబురును అందించే అవకాశం ఉంది.

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత కొత్త కరెన్సీ డిమాండ్ కు తగ్గట్టుగా అందుబాటులో లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో నగదు ఉపసంహరణపై ఆర్ బి ఐ ఆంక్షలను విధించింది.

ఎటిఎం ల నుండి తొలుత రెండువేలు, ఈ ఏడాది జనవరి నుండి నాలుగు వేల ఐదు వందల రూపాయాలను ఉపసంహరణ చేసుకొనేట్టుగా ఆంక్షలను మినహాయించింది.

బ్యాంకుల నుండి సేవింగ్స్ ఖాతాల నుండి వారానికి కనీసం 24 వేల రూపాయాలను డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే దీన్ని కూడ ఇంకా పెంచే అవకాశం ఉందని ఆర్ బి ఐ వర్గాలు చెబుతున్నాయి.

నగదు ఉపసంహరణపై పరిమితిని ఎత్తివేసే అవకాశం

నగదు ఉపసంహరణపై పరిమితిని ఎత్తివేసే అవకాశం

కొత్త కరెన్సీ అందుబాటులో లేని కారణంగా నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను విధించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉందని ఆర్ బి ఐ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకుగాను ఆర్ బి ఐ యోచిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వారానికి కరెంట్ ఖాతాల నుండి 50 వేల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం ఉంది. సేవింగ్స్ ఖాతాల నుండి 24 వేల రూపాయాలను డ్రా చేసుకోవచ్చు. అయితే వీటిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి మరింత ఎక్కువ మొత్తంలో నగదును డ్రా చేసుకొనే అవకాశాన్ని కల్పించేందుకు ఆర్ బి ఐ రంగం సిద్దం చేస్తోంది.

నగడు డ్రా చేసుకొనే పరిమితిని పెంచే అవకాశం

నగడు డ్రా చేసుకొనే పరిమితిని పెంచే అవకాశం

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను దశలవారీగా ఎత్తివేస్తామని గతంలోనే ఆర్ బి ఐ ప్రకటించింది. ఈ మేరకు ఈ వారంలో ఆర్ బి ఐ నుండి కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సేవింగ్స్ ఖాతాల నుండి ప్రతి వారానికి కనీసంగా 35 వేల రూపాయాలను డ్రా చేసుకొనే వెసులుబాటును కల్పించే అవకాశం ఉంది. మరో వైపు కరెంట్ ఖాతాల ద్వారా ప్రతి వారానికి కనీసంగా 50 వేల రూపాయాలను డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంది.అయితే ఈ వెసులుబాటును మరింత పెంచే అవకాశం ఉంది. ప్రతివారానికి కరెంట్ ఖాతా నుండి 50 వేలకంటే ఎక్కువగా డ్రా చేసుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎటిఎంలలో కూడ నగదు ఉపసంహరణపై ఆంక్షలను ఎత్తివేస్తారా

ఎటిఎంలలో కూడ నగదు ఉపసంహరణపై ఆంక్షలను ఎత్తివేస్తారా

ఎటిఎంలలో కూడ నగదు ఉపసంహరణపై ఆంక్షలను ఎత్తివేస్తారా

ఎంతకాలం ఆంక్షలుంటాయి

ఎంతకాలం ఆంక్షలుంటాయి

పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత యాభై రోజుల్లో పరిస్థితులు అన్ని సర్థుకొంటాయని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. అయితే 50 రోజులు దాటాయి. కాని, ఇంకా ఇబ్బందికర పరిస్థితులు మారలేదని విపక్షాలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి డిమాండ్ కు అనుగుణంగా కరెన్సీ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఎంతకాలం పాటు నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు.

English summary
rbi may review cash withdrawals limit this week, after demonetisation cash withdrawals limit from banks and atm , this week rbi review on cash withdrawals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X