వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టపగలు రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పాతకక్షల కారణంగా కాంగ్రెస్ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరు నగరంలోని పిణ్యా సెకండ్ స్టేజ్ లో నివాసం ఉంటున్న నటరాజ్ (40) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంగళవారం పట్టపగలు దారుణంగా హత్య చేశారు. ఇతను కాంగ్రెస్ పార్టీ నాయకుడు.

తావరకెరె, పిణ్యా తదితర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నటరాజ్ తిగరళపాళ్యలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. మంగళవారం కొత్త ఇంటి దగ్గరకు వెళ్లాడు. తరువాత అ పక్కనే నివాసం ఉంటున్న కల్యాణప్ప, మరొ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆటోలో వెళ్లిన కొందరు నిందితులు వేటకోడవళ్లు తీసుకుని నటరాజ్ ను చుట్టుముట్టి విచక్షణారహితంగా నరికి వేశారు.

real estate business man murderd in Bengalore

ఆ సందర్బంలో నటరాజ్ తప్పించుకొవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రత్యర్థులు అతనిని వదలలేదు. తల మీద ఇష్టం వచ్చినట్ల నరకడంతో మెదడు బయటకు వచ్చి సంఘటనా స్థలంలో నటరాజ్ ప్రాణాలు వదిలాడు. ఆ సందర్బంలో కల్యాణప్ప, మరొ వ్యక్తి మీద దాడి చేసిన నిందితులు వారు వచ్చిన ఆటోలో పరారైనారు. నటరాజ్ మీద దాడి జరుగుతున్న సమయంలో స్థానికులు ప్రాణభయంతో పరుగు తీశారు. వి

షయం తెలుసుకున్న రామనగర జిల్లా ఎస్పీ డాక్టర్ చంద్రగుప్త, డీఎస్పీ లక్ష్మిగణేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. నటరాజ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు దర్యాప్తులో ఉందని ఎస్పీ డాక్టర్ చంద్రగుప్త అన్నారు. ఇప్పటికే నటరాజ్ హత్య కేసులో పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల కారణంగా హత్య జరిగి ఉంటుందని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A real estate businessman and Congress leader has been hacked to death in bengaluru of Karntaka state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X