వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలకు ముప్పు: శశికళకు ఫ్యామిలీ చిక్కు, ఎప్పుడే రివర్స్

అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే శశికళకు తిరుగుబాటు తప్పేలా కనిపించడం లేదా? ఆమె కుటుంబం పవర్ సెంటర్‌గా మారుతుందా? అది చూసి కొందరు నేతలకు ఆగ్రహం వస్తుందా? అంటే అవుననే వాదనలు విన

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే శశికళకు తిరుగుబాటు తప్పేలా కనిపించడం లేదా? ఆమె కుటుంబం పవర్ సెంటర్‌గా మారుతుందా? అది చూసి కొందరు నేతలకు ఆగ్రహం వస్తుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి కేపీ మునుసామి.. శశికళ సోదరుడు చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శశికళ, ఆమె కుటుంబం పవర్ సెంటర్‌గా మారే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలని, అంతా తామే కావాలని శశికళ కుటంబం భావిస్తోందని మునుసామి మండిపడ్డారు. శశికళ సోదరుడు దివహరణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

బలవంతంగా..: శశికళకు 'షాక్', తమిళనాడుకు అసలు సీఎం లేరుబలవంతంగా..: శశికళకు 'షాక్', తమిళనాడుకు అసలు సీఎం లేరు

శశికళ సోదరుడు ఇటీవల మాట్లాడుతూ.. శశికళకు, ఆమెకు మద్దతుగా నిలిచిన ఇతర ముఖ్య నేతలకు ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, ఈ ఏడాది పొంగల్ బాధాకరంగా ప్రారంభమైందని, ఈ జనవరిలో అన్నాడీఎంకే ప్రభుత్వం పోతుందని కొందరు చెప్పారని, పార్టీని రెండుగా చీల్చే కుట్ర జరుగుతోందని, తమను టార్గెట్ చేసుకున్నారని, మేం చస్తేనే ఆ కోరిక నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తాము ఏమీ కొత్త కాదన్నారు.

Rebellion brews against Sasikala, family: Former Minister KP Munusamy Condemns Sasikala’s Brother

ఈ వ్యాఖ్యల పైన మునుసామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, పార్టీలో కుటుంబం చక్రం తిప్పాలనుకోవడం సరికాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

శశికళ 'లక్కీ నెంబర్', పన్నీరుకు ఎదురు దెబ్బ!శశికళ 'లక్కీ నెంబర్', పన్నీరుకు ఎదురు దెబ్బ!

త్వరలో శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్ నేతల నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం.

కుటుంబ జోక్యం లేదు

మరోవైపు, మునుసామి పైన మరో సానియర్ నేత సీవీ షణ్ముగం ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుసామి పార్టీని మోసం చేసిన వ్యక్తి అని ఆరోపించారు. మునుసామికి ఏదైనా సమస్య ఉంటే పార్టీలో చర్చించాలని, కానీ మీడియా ముందు కాదన్నారు. శశికళ కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు.

తమకు ప్రాణాపాయమని శశికళ ఫ్యామిలీ

సోమవారం నాడు శశికళ సోదరుడు మాట్లాడుతూ.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీని ముక్కలు చేయాలనే కుయుక్తులు కనిపిస్తున్నాయన్నారు. పార్టీ అధినేత్రికి, ఆమె వెంట ఉన్న ముఖ్య నేతలకు ప్రమాదముందన్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు శశికళ కుటుంబ సబ్యులను రాజకీయాలకు దూరంగా పెట్టారని గుర్తు చేస్తున్నారు.

English summary
Weeks after Sasikala Natarajan took over the leadership of AIADMK as its General Secretary, a rebellion is brewing with dissent making its way through the party cadres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X