వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాయిలెట్ నిర్మించలేదని డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ధుమ్కా: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిచమంటే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని దుమ్క పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళితే.. ఖూబుకుమారి (17) బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది.

తమ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో, తాత ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో తన వివాహానికి ముందే ఇంటిలో మరుగుదొడ్డిని నిర్మించాలని తల్లిదండ్రులను పలుమార్లు కోరింది. అయితే ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు.

Refused Toilet at Home, Class 12 Student Allegedly Commits Suicide

లారీ డ్రైవర్‌ అయిన తండ్రి సమీప పట్టణానికి వెళ్లగా, తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న దుమ్కా జిల్లా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇంటింట మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరగడం దురదృష్టకరమని డీఐజీ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా 'నిర్మల్ గ్రామ్' పథకం కింద జిల్లా నిర్వాహకం ద్వారా ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

English summary
A 17-year-old girl in Jharkhand has allegedly committed suicide after her parents turned down her repeated request to build a toilet at their home, saying they were saving the money for her wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X