వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: రూ.19 నుండి రూ.9999 ప్లాన్స్ ను ప్రకటించిన జియో

రిలయన్స్ జియో తన ప్రైమ్ యూజర్లకు ఇస్తోన్న ప్రీ పెయిడ్ , పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేసింది. కొత్త టారిఫ్ ప్లాన్లను జియో తన వెబ్ సైట్ లో ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ జియో తన ప్రైమ్ యూజర్లకు ఇస్తోన్న ప్రీ పెయిడ్ , పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేసింది. కొత్త టారిఫ్ ప్లాన్లను జియో తన వెబ్ సైట్ లో ప్రకటించింది.అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్క్ గా జియో అవతరించింది.

ఉచిత ఆఫర్లతోనే రంగంలోకి వచ్చిన జియో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. టారిఫ్ ప్లాన్లతో పాటు పలు ఆఫర్లతో జియో ప్రత్యర్థి కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. డేటా ప్లాన్లతో పాటు వాయిస్ కాల్స్ లో కూడ ఆఫర్లను ఇస్తున్నాయి ఇతర కంపెనీలు.

రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లను పోలిన ఆఫర్లతోనే ఇతర టెలికం కంపెనీలు ముందుకు వచ్చాయి.అయితే టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా వినియోగదారులకు కొంత తక్కువ ధరకే డేటా దొరికే అవకాశాలు నెలకొన్నాయి.

ప్యాకేజీలను అప్ డేట్ చేసిన జియో

ప్యాకేజీలను అప్ డేట్ చేసిన జియో

ఇప్పటివరకు ఉన్న ప్లాన్స్ ను జియో అప్ డేట్ చేసింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను ఎక్కువ డేటాతో అప్ డేట్ చేసింది. ముందుగా చెప్పినట్టుగానే అతి తక్కువ నుండి అతి ఎక్కువ వరకు జియోలో ప్లాన్స్ ఉన్నాయి. ప్రీపెయిడ్ లో రూ.19 నుండి 9999 రూపాయాల వరకు ప్లాన్స్ ఉన్నాయి. మరో వైపు పోస్ట్ పెయిడ్ లో కూడ రూ.309, 509, 999 రూపాయాల ప్లాన్ ఉన్నాయి.

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జీ చేసుకొనే మొత్తంపై ఆధారపడి ఉంటాయి. 19 రూపాయాల ప్లాన్ తో రోజంతా 200 ఎంబీ 4 జీ డేటాను ప్రైమ్ యూజర్లకు కల్పించనుంది జియో. అదే విధంగా నాన్ ప్రైమ్ యూజర్లు అయితే 100 ఏంబీ డేటాను పొందనున్నారు. అదే విధంగా రూ.49, రూ.96, రూ.149 రీఛార్జీ ప్యాక్ లతో ప్రైమ్, నాన్ ప్రైమ్ యూజర్లకు డేటా ఆఫర్లను అందించనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్ లో ప్రకటించింది.

జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్

జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్

పోస్ట్ పెయిడ్ జియో కస్టమర్లు రూ.309 ప్లాన్ కింద ఫస్ట్ రీ చార్జ్ మూడు నెలల వరకు 90 జీబీ డేటాను పొందనున్నారు. రోజుకూ 1 జీబీ డేటాను వాడుకోవచ్చు. అదే 509 రూపాయాల ఫస్ట్ రీచార్జ్ తో అయితే 180 జీబీ 4 జీబీ డేటాను మూడు మాసాల వరకు వాడుకోవచ్చు. అంటే రోజుకు 2 జీబీ డేటాను యూజర్లు పొందుతారు.రూ.999 రూపాయాల రీఛార్జీతో కూడ 180 జీబీ డేటాను పొందే అవకాశం ఉంది. కానీ, డైలీ వాడకంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఈ మూడు ప్లాన్స్ పై ఫస్ట్ రీచార్జీ తర్వాత రీచార్జీలపై 60 జీబీ డేటానె నెలరోజుల పాటు పొందుతారు.

అతి పెద్ద నెట్ వర్క్ గా జియో

అతి పెద్ద నెట్ వర్క్ గా జియో

సంచలన ఆఫర్లతో మార్కెట్ లోకి వచ్చిన రిలయన్స్ జియో వినియోగదారుల ఆదరాభిమానాలను సంపాదించుకొంది. అమెరికాలోని మొత్తం మొబైల్ నెట్ వర్క్ లపై వినియోగమౌతున్న డేటాను జియో చందాదారులు వినియోగిస్తున్నారు. ఇక జియో యూజర్స్ వినియోగిస్తున్న డేటా చైనాలో వినియోగిస్తున్న డేటా కంటే 50 శాతం ఎక్కువేనని రిలయన్స్ జియో ప్రకటించింది.ప్రతి రోజూ 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్ , వీడియో నిమిషాలతో జిజయో అతి పెద్ద నెట్ వర్క్ గా అవతరించింది.ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ కస్టమర్ల సంఖ్య 10.80 కోట్లకు చేరిందని ఆ సంస్థ ప్రకటించింది,

English summary
Reliance Jio has updated its prepaid and postpaid plans to give Jio Prime users data benefits till June-end. For a while now, Reliance Jio had only listed three prepaid plans on its website, but the company has updated its website to bring back postpaid and prepaid plans at the same prices as before, but with more data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X