వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడిన మిస్టరీ: ఆ 60 రోజులు రాహుల్ ఏంచేశారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ తీసుకున్న సంగతి తెలిసిందే. అది కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందుగా సెలవుపై వెళ్లిన ఆయన బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కాని తిరిగి రాలేదు.

తన పర్యటనలో భాగంగా ఎక్కడికెళుతున్నారు? ఎన్ని రోజులు పర్యటన సాగుతుంది? అనే విషయాలు ఎవరికీ చెప్పకుండా ఆయన వెళ్లిపోయినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే సెలవు ఏంటంటూ అప్పట్లో బీజేపీ సహా పలు పార్టీలు రాహుల్ పర్యటనపై మండిపడ్డాయి.

What Rahul Gandhi did for the 60 days he went missing

అయినా కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ పర్యటన వివరాలను వెల్లడించలేదు. తాజాగా తాజాగా రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ లో ఎక్కడెక్కడికి వెళ్లారు? ఆయా ప్రాంతాల్లో ఎన్ని రోజులు బస చేశారు? తదితర వివరాలన్నిటీని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

What Rahul Gandhi did for the 60 days he went missing

* ఫిబ్రవరి 16న న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ అదే రోజు థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు.
* ఒక రోజు బ్యాంకాక్ లోనే ఆయన బస చేశారు.
* ఫిబ్రవరి 17న బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఆయన కంబోడియా చేరుకున్నారు. 11 రోజుల పాటు అక్కడే ఉన్నారు.
* కంబోడియా పర్యటనను ముగించుకున్న ఆయన ఫిబ్రవరి 28న తిరిగి బ్యాంకాక్ వచ్చారు.
* ఒక రోజు బ్యాంకాక్ లోనే ఉన్న రాహుల్, మార్చి 1న మయన్మార్ వెళ్లారు. దాదాపు 21 రోజుల పాటు మయన్మార్ లోనే ఉన్నారు.
* మార్చి 22న ధాయ్ ల్యాండ్ తిరిగివచ్చిన రాహుల్ ఆయుత్తయలోని బుద్ధిస్ట్ హెరిటేజ్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడే ఆయన 9 రోజుల పాటు గడిపారు
* మార్చి 31న వియత్నాం వెళ్లిన రాహుల్ ఏప్రిల్ 12న బ్యాంకాక్ తిరిగివచ్చారు.
* ఏప్రిల్ 12 నుంచి 16 వరకు రాహుల్ గాంధీ బ్యాంకాక్ లోనే సేదదీరారు.
* ఏప్రిల్ 16న తన సుదీర్ఘ సెలవును ముగించుకుని రాహుల్ గాంధీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు.
* 56 రోజుల పాటు రాహుల్ సెలవు పెట్టారని నాడు వార్తలు వినిపించాయి. అయితే వాస్తవానికి రాహుల్ గాంధీ సరిగ్గా 60 రోజుల పాటు సెలవులో ఉన్నారు.

English summary
Congress vice-president Rahul Gandhi's 60-day vacation trip to four South Asian nations, mostly sponsored by a foreign company, is back in limelight. India Today has accessed the specific details of where the Congress leader was from February 16 to April 16, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X