వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవరించిన పోలవరం అంచనాలు ఆమోదం పొందలేదు: కేంద్రమంత్రి సంజయ్

పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారంనాడు కీలకమైన చర్చ జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కుప్రాజెక్టు అధారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైసీపీ , కాంగ్రెస్ పార్టీలు ఎంపిలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారంనాడు కీలకమైన చర్చ జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కుప్రాజెక్టు అధారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైసీపీ , కాంగ్రెస్ పార్టీలు ఎంపిలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రూ.16వేలకోట్ల అంచనాలకు ఆమోదం ఉందని, ఆ తర్వాత రివైజ్డ్ ఎస్టిమేషన్స్ రాలేదని కేంద్రమంత్రి సంజయ్ బల్యాన్ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ. 3,300 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.

Revised estimates are not approved from Polavaram authority

త్వరలో మరో రూ.1000 కోట్లను విడుదల చేయనున్నట్టు చెప్పారాయన. బిజెడి ఎంపీ నరేంద్ర కుమార్ స్వాన్ ఈ చర్చలో జోక్యం చేసుకొన్నారు. పోలవరం అంశం కోర్టులో ఉండగా ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు.
పోలవరంపై కోర్టులో ఎలాంటి స్టే లేదని పర్యావరణ ప్రభావ మదింపు జరుగుతోందని కేంద్రమంత్రి బల్యాన్ వెల్లడించారు.

ఒడిశాపై ఏదైనా ప్రభావం ఉంటే ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గిరిజనుల ప్రాంతంలో ఉందని 2008 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా గిరిజనులకు భూమి ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

పోలవరం ప్రాజెక్టు కారణంగా లక్షా8 వేల మంది నిరాశ్రయులయ్యారని వీరికి రూ.9,800 కోట్ల ఖర్చుచేసినట్టు మంత్రి చెప్పారు. 28,557 కుటుంబాలను తరలించామని, ఇందులో 3,052 మందికి పునరావాసం కల్పించామన్నారు.

ఏ కారణంగానైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికి బదలాయించారని కాంగ్రెస్ పార్టీ ఎంపి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకే నిర్మాణ బాధ్యతలను ఏపీకి అప్పగించామని ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రివైజ్డ్ ఎస్టిమేట్స్ తయారుచేస్తోందని, త్వరలోనే కేంద్రానికి అందుతాయన్నారు.

English summary
Key discussions held in Rajya Sabha on Monday.Congress and Ysrcp Mp's participated in this discussions. Revised estimates are not approved from Polavaram authority said union minister sanjay in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X