వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమాపణ చెప్పను, నా హక్కు: రాబర్ట్ వాద్రా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై పార్ల మెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాను ఎటువంటి పరిస్థితులలో క్షమాపణ చెప్పను అని రాబర్ట్ వాద్రా తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన నోటీసులకు ఆయన సమాధానం ఇచ్చారు. తన అభిప్రాయాలు స్వేచ్చగా వెల్లండించే హక్కు తనకు ఉందని నిక్కచ్చిగా సమాధానం ఇచ్చారు.

పార్లమెంట్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, పార్లమెంట్ ను తాను అగౌరవపరచలేదని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి, విషయాలను పక్కదారి పట్టించే రాజకీయ ఎత్తుగడలు వేసుకోనివ్వండి అని వాద్రా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Robert Vadra, the son-in-law of Congress president Sonia Gandhi

అంతే కాకుండ ప్రజలు ఏమి తెలివి తక్కువవాళ్లు కాదు, ఇలాంటి నాయకుల నాయకత్వంలో దేశాన్ని చూడల్సి రావడం చాల భాదాకరంగా ఉందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీనిపై అధికార బీజేపీ మండిపడింది. లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ అర్జున్ రామ్ మేఘావాల్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

అయితే రాబర్ట్ వాద్రా ఇచ్చిన సమాధానంతో ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తారా, లేదా ప్రివిలేజ్ కమిటికి విన్నవించాలా అనే దానిపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వాద్రా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

English summary
Lok Sabha Speaker Sumitra Mahajan will now decide whether to refer a BJP complaint against Mr Vadra to the privilege committee or close the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X