బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ కర్మకాండ, రూప బదిలి, అబ్బే అదేం లేదు: సీఎం, కర్ణాటకలో చిన్నమ్మ పెత్తనం !

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ కర్మకాండ గురించి బహిరంగంగా లేఖ రాసిన డీఐజీ రూపను ట్రాఫిక్.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ కర్మకాండ గురించి బహిరంగంగా లేఖ రాసిన డీఐజీ రూపను ట్రాఫిక్, రోడ్డు సేఫ్టీ విభాగానికి బదిలీ చెయ్యడంతో రాజకీయాలకు అతీతంగా పలువురు మండిపడుతున్నారు.

సెంట్రల్ జైల్లో శశికళ కలకలం: చిన్నమ్మ ఎఫెక్ట్, డీఐజీ రూప బదిలి, ఇక నుంచి రోడ్డు మీద!సెంట్రల్ జైల్లో శశికళ కలకలం: చిన్నమ్మ ఎఫెక్ట్, డీఐజీ రూప బదిలి, ఇక నుంచి రోడ్డు మీద!

ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. సోమవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పరిపాలనలో భాగంగానే డీఐజీ రూపను బదిలి చేశామని, అందులో ప్రత్యేకత ఏమీ లేదని అన్నారు. డీఐజీ రూపతో సహ మరి కొంత మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశామని సీఎం సిద్దూ చెప్పారు.

మీకు అన్నీ చెబుతారా ?

మీకు అన్నీ చెబుతారా ?

ప్రతి విషయం మీడియా ముందు వివరించనవసరం లేదని సీఎం సిద్దరామయ్య తన ప్రభుత్వాన్ని సమర్థించుకున్నారు. అయితే డీఐజీ రూపను బదిలి చేసిన విషయంపై సిద్దరామయ్య ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Recommended Video

Sasikala bribes prison officers, gets luxury treatment in jail | Oneindia News
రెండు సార్లు లేఖ, అందుకే !

రెండు సార్లు లేఖ, అందుకే !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాల గురించి ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినందు వలనే డీఐజీ రూపను బదిలి చేశారని ఆరోపించారు.

నిజాయితీగా ఉంటే సిద్దూకు నచ్చదు

నిజాయితీగా ఉంటే సిద్దూకు నచ్చదు

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాలకు ప్రభుత్వమే అండగా ఉందని తెలుసుకోవడానికి రూప బదిలి ఒక్క ఉదాహరణ అని కుమారస్వామి విమర్శించారు. నిజాయితీగా పని చేసే అధికారులను చూస్తే సిద్దరామయ్యకు సహించదని వ్యంగంగా అన్నారు.

నెల పూర్తి కాకముందే !

నెల పూర్తి కాకముందే !

పరిపాలనలో భాగంగా డీఐజీ రూపను బదిలి చేశామని సీఎం చెబుతున్నారని, జైళ్ల శాఖకు ఆమెను బదిలి చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదని, పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాల గురించి నిజాయితీగా బయటపెట్టడం వలనే ఆమెను బదిలి చేశారని కుమారస్వామి ఆరోపించారు.

కర్ణాటకలో శశికళ పెత్తనం

కర్ణాటకలో శశికళ పెత్తనం

డీఐజీ రూప బదిలి విషయంపై కర్ణాటక ప్రజలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న శశికళ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మీద పెత్తనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకువచ్చి జైల్లో తన నిజ స్వరూపం బయటపెట్టిన డీఐజీ రూపను శశికళ బదిలి చేయించారా ? అనే అనుమానం వస్తోందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.

English summary
It is an administrative process. It is not necessary to disclose everything to the media,” said Karnataka chief minister Siddaramaiah on police officer D.Roopa's transfer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X