వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి: కర్నాటకలో భారీగా రూ.2వేల నోట్ల కరెన్సీ స్వాధీనం

కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తాజాగా, భారీస్థాయిలో కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు 32 కి.మీ. దూరంలోని బైలూరు వద్ద ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.71లక్షల విలువైన రూ.2000 నోట్లను గుర్తించారు.

 Rs 71 lakh in new currency seized in Karnataka

ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల భారీస్థాయిలో కరెన్సీ లభ్యమవుతోంది. శనివారం బెంగళూరు, తుమకూరు, మడికేరిల్లో వేర్వేరుచోట్ల చేపట్టిన తనిఖీల్లో రూ.74.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై ఉడుపి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటీ బాలకృష్ణ మాట్లాడుతూ.. రూ.71 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురి నుంచి గుర్తించామన్నారు. వారంతో ఓ కారులో కొత్త రూ.2వేల నోట్లు తీసుకు వస్తున్నారని తెలిపారు.

English summary
Udupi Superintendent of Police K T Balakrishna said, Rs 71 lakh was seized from three persons who were arrested for carrying new Rs 2,000 notes in their car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X